తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ట్యూషన్ పెట్టుకోండి, బుద్ది వస్తుంది, పక్క రాష్ట్రం లీడర్స్ కు క్లాస్!

మన్మోహన్‌ సింగ్‌ ప్రధాన మంత్రిగా ఉన్న హయాంలో కూడా కర్ణాటకకు కరువు సాయం అందడంలో ఆలస్యమైందని, అప్పుడు నోరు మెదపని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు కేంద్రం ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ గురించి మాట్లాడుతున్నారని, మీరంతా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర ట్యూషన్ చెప్పించుకోండి, అప్పుడు బుద్ది వస్తుందని కర్ణాటక శాసన సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్, అశోక్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

కర్ణాటకలో పనికిమాలిన ప్రభుత్వం ఉందని, పని చెయ్యడం చేతకాక ఎప్పుడూ కేంద్రంలోని బీజేపీ మీద విమర్శులు చేస్తోందని ఆర్. అశోక్ ఆరోపించారు. బెంగళూరులో విలేకరులతో మాట్లాడని ఆర్, అశోక్ కరువు సాయం అందించేందుకు ప్రవర్తనా నియమావళి వర్తించదనే విషయాన్ని కాంగ్రెస్ నాయకులు గుర్తు పెట్టుకోవాలని సూచించారు. కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం కేంద్రం ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకోకుండా కాంగ్రెస్ వాళ్లు రాజకీయాలు చేస్తున్నారని ఆర్, అశోక్ ఆరోపించారు.

BJP leader R Ashok said Karnataka Congress leaders should seek tuition from Telangana CM Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ గురించి గొప్పగా మాట్లాడారని, తెలగాణకు కావాలసిన నిధులను రేవంత్ రెడ్డి విడుదల చేయించుకుంటున్నారని, కర్ణాటకలోని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ట్యూషన్ చెప్పించుకోవాలని ఆర్. అశోక్ వ్యంగంగా అన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం లోక్ సభ ఎన్నికల కోసం పొరుగున ఉన్న తమిళనాడుకు కావేరీ నీటిని మళ్లిస్తోందని ఆర్. అశోక్ ఆరోపించారు.

రైతులకు కరువు సాయం అందించడానికి కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని, కానీ తమిళనాడుకు కావేరీ నీటి ప్రవాహం మాత్రం కొనసాగుతోంది ఆర్ అశోక్ మండిపడ్డారు. నీటి కోసం కర్ణాటక రైతులు పోరాడుతున్నారని, తాగునీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలు పట్టుకుని వీధుల్లో ఉంటున్నారని, బెంగళూరులో విపరీతమైన నీటి కొరత ఉందని, ఇదంతా సిద్దరామయ్య ప్రభుత్వ వైఫల్యాల వల్లే జరిగిందని బీజేపీ సీనియర్ నాయకుడు ఆర్, అశోక్ ఆరోపించారు.

BJP leader R Ashok said Karnataka Congress leaders should seek tuition from Telangana CM Revanth Reddy

బెంగళూరుతో సహా కర్ణాటకలోని పలు జిల్లాల్లో కరువు ఉన్నా కావేరీ నీటిని తమిళనాడుకు తరలిస్తున్నారని, తమిళనాడులో లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తాగునీరు ఇస్తున్నారని, ఓటు బ్యాంకు కోసం మైనార్టీలను ఆకట్టుకునేందుకు కృషి చేస్తున్నారని, సమన్యాయం కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్రానికి ద్రోహం చేస్తోందని బీజేపీ సీనియర్ నేత, కర్ణాటకలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక్ ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+