వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ కూర్చున్న కుర్చీ కోసం లక్షల్లో బిడ్‌లు, ఓనర్ నో

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ కుర్చీ కోసం ఆ పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. కూర్చీ కోసం పోటీ అంటే ప్రధాని పదవి కోసమే లేక 2014 సాధారణ ఎన్నికలలో బిజెపి గెలిచి ఆయన ప్రధాని అయితే గుజరాత్ పీఠం కోసమో కాదు!

మోడీ కూర్చున్న ఓ కూర్చీ కోసం నాయకులు పోటీ పడుతున్నారు. ఉత్తర ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన సభలో మోడీ కూర్చున్న కుర్చీ కోసం నాయకులు వేలం పాడుతున్నారు.

సమాచారం మేరకు బిజెపి ఎమ్మెల్యే జగన్ ప్రసాద్ గార్గ్ ఈ కుర్చీ కోసం రూ.1.25 లక్షల పాట పాడారు. ఎమ్మెల్యే యోగేంద్ర ఉపాధ్యాయ, పార్లమెంటు సభ్యులు రామ్ శంకర్ కఠేరియాలు కూడా లక్ష రూపాయల పాట పాడారు.

BJP leaders bid in lakhs to buy chair Narendra Modi sat on

మరోవైపు ఈ కార్యక్రమం కోసం కుర్చీలు, ఇతర వస్తువులు సరఫరా చేసిన ప్రమోద్ ఉపాధ్యాయ మాత్రం ఆ కుర్చీని అమ్మేందుకు నిరాకరిస్తున్నారు. దానిని ఆయన తన వద్దే ఉంచుకుంటానని చెబుతున్నారు. ఆయన స్థానిక బిజెపి కార్పోరేటర్.

ఈ వేలం ఓ కార్యకర్త నుండి ప్రారంభమైంది. మోడీ కూర్చున్న కుర్చీని తనకు అమ్మాలని ఓ కార్యకర్త కోరారు. ఆ కుర్చీ కోసం రూ.2 వేలు చెల్లించేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత నాయకులు కుర్చీ కోసం బిడ్ వేయడం ప్రారంభించారు.

మోడీ నవంబర్ 21వ తేదీన అగ్రాలోని కోఠి మీనా బజార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఆ సమయంలోనే అతను కూర్చున్న కుర్చీ కోసం గిరాకీ పెరిగింది.

English summary
It is literally a fight for the chair among BJP leaders in Agra as they bid as high as Rs 1.25 lakh for the piece of furniture on which BJP's prime ministerial nominee Narendra Modi sat during a recent public meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X