అక్కాచెల్లిని ఎత్తుకెళ్లి 10 మంది గ్యాంగ్ రేప్, గ్యాంగ్ లీడర్ అధికార పార్టీ లీడర్ కొడుకు !

రాయ్ పూర్: రక్షా బంధన్ పండుగ రోజున ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ సంఘటన వెలుగు చూసింది. రక్షా బంధన్‌ వేడుకలు ముగించుకుని ఇంటి నుంచి తిరిగి వస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఈ కేసులో ఓ సీనియర్ బీజేపీ నేత కొడుకు సహా 10 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ బంధువుల ఇంటికి వెళ్లి రాఖీ పండుగను జరుపుకున్నారు. సాయంత్రం బంధువుల ఇంటి నుంచి వారి ఇంటికి వెలుతుండగా ముగ్గురు కామాంధులు అక్కాచెల్లెళ్లను అడ్డగించి వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లు, పర్సులు లాక్కొన్నారు. అనంతరం రోడ్డుపైనే ఆపి ఇద్దరిని వేధింపులకు గురిచేశారు. అదే సమయంలో మళ్లీ 7 మంది బైక్‌ లపై అక్కడికి చేరుకున్నారు.

BJP

ఇద్దరు అక్కాచెల్లెళ్లను పట్టుకుని నిర్జన ప్రాంతానికి లాక్కొని వెళ్లి వారి మీద సామూహిక అత్యాచారం చేశారు. తర్వాత ఆయువతులు వారి నుంచి తప్పించుకున్నారు. అత్యాచారం, దాడి గురించి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు చెప్పారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ప్రారంభించి స్థానిక బీజేపీ నేత కుమారుడు పూనమ్ ఠాకూర్ సహా పది మంది నిందితులను అరెస్టు చేశారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ నాయకుడి కుమారుడు పూనమ్ ఠాకూర్ ఆగస్టులో ఓ కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలయ్యాడు. ఇప్పుడు మళ్లీ అతను జైలుకు వెళ్లాడు. ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసు అధికారులు తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. దీంతో ఈ కేసులో బీజేపీ నేత కొడుకు అరెస్ట్ కావడం ఆ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తోందని తెలిసింది.

ఛత్తీస్‌గఢ్ లోని బీజేపీ నాయకులు ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ మంత్రి బహిరంగ ప్రదేశంలో బీడీ తాగుతూ ఓ గిరిజనుడికి పొగ తాగించిన వీడియో వైరల్ అయ్యింది. బస్తర్ సమీపంలోని ఒక గ్రామంలో కవాసి లఖామా అనే మంత్రి తన అనుచరులతో కలిసి నడుచుకుంటూ వెలుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది.

ఈ సమయంలో సమీపంలోని గిరిజనులను తన దగ్గరకు పిలిచి బీడీ పొగను నోటిలోంచి లోపలికి, ముక్కు ద్వారా బయటకు తీయమని చెప్పాడు. దాని వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజల నుండి తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. ఛత్తీస్‌గఢ్ ఓ మంత్రి బహిరంగ ప్రదేశంలో బీడీ తాగడమే కాకుండా ఓ గిరిజనుడికి బలవంతంగా పొగతాగించడం కలకం రేపింది.

BJP

ఆ వీడియో బయటకు వచ్చి వైరల్ కావడంతో ఆ మంత్రి మీద ప్రజలు, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బస్తర్ సమీపంలోని ఓ గ్రామంలో కవాసి లఖామా అనే మంత్రి తన అనుచరులతో కలిసి బీడీలు తాగుతూ వెతుతున్న వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+