టిప్పు సుల్తాన్ కు కత్తి ఉంటే మా దేవుళ్లకు విష్ణుచక్రం, త్రిశూలం, ఖడ్గం ఉంది జాగ్రత్త !
బెంగళూరు/కోలారు: టిప్పు సుల్తాన్ (tipu sultan) ఆయన చేతిలో ఖడ్డం పెట్టుకుని తిరిగాడని ఓ వర్గం వాళ్లు ప్రచారం చేసి అదే ఖడ్గం పెట్టుకుని రోడ్ల మీదకు వస్తే మేము పూజించే హనుమంతుడి చేతిలోని గద, శ్రీక్రిష్ణుడి చేతిలోని సుదర్శన చక్రం, శివుడి చేతిలోని త్రిశూలం చేతిలో పెట్టుకున రావాల్సి వస్తుందని, టిప్పు సుల్తాన్ ను (tipu sultan) అంతం చేసిన ఉరిగౌడ, నంజేగౌడ చేతుల్లో కూడా ఖడ్గం ఉందనే విషయం ఓ వర్గం వాళ్లు గుర్తు పెట్టుకుంటే వారికే మంచిదని మాజీ మంత్రి, బీజేపీ మాజీ జాతీయ ప్రదాన కార్యదర్శి సీటీ. రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ లోని కోలార్‌లో కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టడానికి తనను రావొద్దని అంటున్నారని, కోలారు ఏమైనా పాకిస్థాన్‌లో ఉందా అని సీటీ రవి సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నేను తాలిబన్ ఉగ్రవాదిని కాదని, బాంబు వేసిన చరిత్ర తనకు లేదని బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి సీ.టీ రవి అన్నారు, కోలారులో జరిగిన బహిరంగ సభలో బీజేపీ (BJP) కార్యకర్తలను ఉద్దేశించి సీటీ రవి మాట్లాడారు.

రెండు రకాల వ్యక్తుల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలని సీటీ రవి అన్నారు. కోలార్‌లో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమంలో సీటీ రవి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ సరిహద్దులోని శ్రీనివాస్‌పురంలో గత పదేళ్లుగా వ్యవసాయం చేస్తున్న అన్నదాతలపై దౌర్జన్యం జరిగిందని, దీనికి సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వం కారణం అని సీటీ రవి ఆరోపించారు. ఈ సిద్దరామయ్య ప్రభుత్వం వ్యతిరేక ప్రభుత్వమే కాకుండా భూకబ్జాదారుల ప్రభుత్వమని సీటీ, రవి ఆరోపించారు.

సిద్దరామయ్య ప్రభుత్వానికి బలం ఉంటే అర్కావతి కుంభకోణానికి సంబంధించిన రెడ్ రిపోర్ట్ ఇవ్వాలని, నైస్ కుంభకోణంలో రైతుల భూ ఆక్రమణలపై టీబీ జయచంద్ర హౌస్ కమిటీ నివేదిక ఇవ్వాలని సీటీ రవి డిమాండ్ చేశారు. ఈ నివేదికలు బయటకు వస్తే అప్పుడు తెలుస్తుంది చాలా మంది భూకబ్జాదారులు ఈ ప్రభుత్వంలో (siddaramaiah)భాగం అయ్యారని సీటీ రవి అన్నారు. ఈ ప్రభుత్వం పాపాలు నిండుగా పెరిగిపోయాయని, ఈపాపాల ప్రభుత్వం ఇంకా కొనసాగాలా అని కోలారు ప్రజలను (BJP) సీటీ రవి ప్రశ్నించారు.
రాత్రికి రాత్రి పొలంలో వందలాది మామాడి చెట్టును నరికిన పాపానికి ప్రాయశ్చిత్తం కూడా లేకుండా కాంగ్రెస్ (Congress) నాయకులు సంతోషంగా చిందులు వేస్తున్నారని, వారి అరాచకాలు చెప్పడానికి తాము ఇక్కడికి వచ్చామని సీటీ రవి చెప్పారు. మీరు పాపులు; మిమ్మల్ని నమ్మి అధికారం ఇచ్చిన మోసపోయిన ప్రజలు ఏకం చేసే పని చేస్తున్నామని, త్వరలోనే ప్రజలు మీ మీద తిరగబడుతారని సిద్దరామయ్య (siddaramaiah)ప్రభుత్వాన్ని సీటీ రవి హెచ్చరించారు.
ఇదే సమయంలో బీజేపీ కర్ణాటక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్.రవికుమార్ (BJP) మాట్లాడుతూ ప్రజల చేత ఎన్నుకోబడిన మన ఎంపీ మునిస్వామిని (BJP) వేదికపై నుంచి దింపడం ఎంతవరకు సమంజసం అంటూ ముఖ్యమంత్రి సిద్దరామయ్యను (siddaramaiah)ప్రశ్నించారు. తమను అవమానించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య కాదా అని ప్రశ్నించారు. అలా అయితే మీ ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

దేశ విదేశాలకు మామిడి (mango) పండ్లను పంపే శ్రీనివాసపురం తాలూకా రైతుల పొలాల్లోకి దొంగల్లాగా 70-80 జేసీబీలతో డీఎఫ్‌ఓ రాత్రికి రాత్రే వచ్చి మామిడి చెట్లను నరికేశారని రవికుమార్ ఆరోపించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అక్రమ విధ్వంసం చేశారని బీజేపీ నాయకులు ఆరోపించారు. డీఎఫ్‌వో ఏడుకొండలను వెంటనే సస్పెండ్ చేయాలని మాజీ సీఎం, బీజేపీ ఎంపీ డీవి. సదానంద గౌడ డిమాండ్ చేశారు.
మాజీ స్పీకర్, కాంగ్రెస్ (Congress) పార్టీ సీనియర్ నాయకుడు రమేష్ కుమార్ అక్రమంగా ఆక్రమించిన అటవి భూమిలోని ఒక్క అంగుళం (mango) కూడా అటవి శాఖ అధికారులు ముట్టుకోలేదని మాజీ సీఎం డీవీ. సదానందగౌడ ఆరోపించారు. బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించడం కాంగ్రెస్ (Congress) నాయకులు అలవాటు అయిపోందని, అన్ని ప్రజలు చూస్తున్నారని, ప్రజలు ఊరుకోరని డీవీ సదానందగౌడ కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
-
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications