వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ 105, ఎన్సీపీ 35 ఈక్వల్ టు 140.. ఐదు సీట్ల దూరంలో ఫడ్నవీస్ సర్కార్..

|
Google Oneindia TeluguNews

మహారాష్ట్ర రాజకీయాల్లో మహా కుదుపు. శనివారం ఉదయం 7.30 గంటలు. దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ తమ కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఇంతలో అక్కడికొచ్చిన గవర్నర్ భగత్‌సింగ్ కొషియారి వారితో సీఎం, డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా ప్రకంపనాలు సృష్టించాయి. అయితే బీజేపీ మెజార్టీ మార్కుకు చేరుకుందా ? లేదా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. మహారాష్ట్ర మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ సాధించిందా ? వన్ ఇండియా ప్రత్యేక కథనం.

ఫడ్నవీస్ కు ఈనెల 30 డెడ్ లైన్: బలపరీక్షకు కొత్త వ్యూహాలు: సేన..ఎన్సీపీ చీలికపైనే ఆధారం..!ఫడ్నవీస్ కు ఈనెల 30 డెడ్ లైన్: బలపరీక్షకు కొత్త వ్యూహాలు: సేన..ఎన్సీపీ చీలికపైనే ఆధారం..!

కూటమిలో కుమ్ములాట

కూటమిలో కుమ్ములాట

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుకు 145 సీట్లు కావాలి. 105 సీట్లు సాధించిన బీజేపీ ముందువరసలో నిలిచింది. కానీ భాగస్వామ్య పక్షాల మధ్య చర్చలు బెడిసికొట్టడంతో చివరికి రాష్ట్రపతి పాలన విధించారు. దీంతో ప్రధాన పార్టీల మధ్య ప్రభుత్వ ఏర్పాటుపై చర్చోపచర్చలు జరిగాయి. శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనుకునే దశలో తెరపైకి దేవేంద్ర ఫడ్నవీస్ వచ్చారు.

140 సభ్యులే

140 సభ్యులే

బీజేపీ 105 మంది సభ్యులకు ఎన్సీపీ 35 మంది సభ్యులు చేరారు. దీంతో 140 స్థానాల వద్ద దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం ఆగిపోయింది. మెజార్టీ మార్కుకు 5 సీట్ల దూరంలో నిలిచిపోయింది. దీంతో ఆ ఐదుగురు ఎవరు అనే చర్చ తలెత్తింది. ఎన్సీపీ నుంచి మిగతా నేతలు వస్తారా ? లేదంటే శివసేన, కాంగ్రెస్ సభ్యులకు గాలం వేశారా అనే అంశం హాట్ టాపిక్‌గా మారింది.

వారం గడువు

వారం గడువు

మెజార్టీ నిరూపించుకునేందుకు ఫడ్నవీస్‌కు గవర్నర్ భగత్‌సింగ్ కొషియారి వారం రోజుల సమయం ఇచ్చారు. ఈలోపు ప్రలోభాల పర్వంతో బీజేపీ ప్రభుత్వం గట్టెక్కుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. చిన్న చితకా పార్టీలు, స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం సులువుగానే గట్టెక్కుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి.

Recommended Video

Devendra Fadnavis Takes Oath As Maharashtra CM || డిప్యూటీగా అజిత్ పవార్
13 మంది స్వతంత్రులు

13 మంది స్వతంత్రులు

చిన్న చితకా పార్టీలు కాక 13 మంది ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వీరికి ఆశచూపి తమవైపు తిప్పుకుంటే ప్రభుత్వం కొనసాగడం అంత కష్టమైన విషయమేమి కాదనే వాదన వినిపిస్తోంది. బహుజన్ వికాస్ పార్టీ నుంచి ముగ్గురు సభ్యులు గెలుపొందారు. వీరి మద్దతిచ్చినా ఫడ్నవీస్ సర్కార్ మ్యాజిక్ ఫిగర్ మార్క్ దాటుతుంది.

English summary
in maharashtra bjp have 140 mlas only. bjp mlas are 105, ajit pawar supporters 35 members.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X