వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ ఎఫెక్ట్, జార్ఖండ్‌లో ఒంటరిగానే పోటీ చేస్తాం: బీజేపీ

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్‌, జార్ఖండ్‌ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలను ఐదు దశల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం శనివారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఒంటరిగానే పోటీకి చేసేందుకు భారతీయ జనతా పార్టీ సన్నాహాలు చేస్తుంది.

జార్ఖండ్‌లో జరగబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని పార్టీ నిర్ణయం తీసుకుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘబార్ దాస్ మీడియాకు వెల్లడించారు.

జార్ఖండ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు. రాష్ట్ర ప్రజలంతా బీజేపీ వెంట ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో జేడీ(యూ)తో కలిసి బీజేపీ పోటీ చేసి 18 సీట్లలో విజయం సాధించింది.

BJP may contest without ally in Jharkhand

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మొత్తం 14 స్థానాలకుగాను 12 స్థానాల్లో విజయం సాధించింది. జేఎంఎం కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. లోక్‌సభ ఫలితాలే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతమయ్యేలా చూడాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

జార్ఖండ్‌లో ఐదు దఫాలుగా ఎన్నికలు జరుగుతున్నాయి. జార్ఖండ్‌లో రెండేళ్లుగా జార్ఖండ్‌ ముక్తిమోర్చా(జేఎంఎం), కాంగ్రెస్‌ కూటమి అధికారంలో ఉంది. అంతకు ముందు మూడేళ్లు జేఎంఎం, బీజేపీ కూటమి పాలన సాగించింది.

జార్ఖండా రాష్ట్ర అసెంబ్లీలో ప్రస్తుత బలాబలాలు(81స్థానాలు) ఇలా ఉన్నాయి.
కాంగ్రెస్‌, జార్ఖండ్‌ వికాస్‌ మోర్చా(జేవీఎం), సీపీఎం కూటమి: 25,
బీజేపీ, జేడీ(యు) కూటమి: 20,
జేఎంఎం: 18, స్వతంత్రులు 18.

ఎన్నికల షెడ్యూల్‌:
తొలి దశ పోలింగ్‌ : నవంబర్‌ 25
రెండో దశ : డిసెంబర్‌ 2
మూడో దశ : డిసెంబర్‌ 9
నాలుగో దశ : డిసెంబర్‌ 14
ఐదో దశ : డిసెంబర్‌ 20
ఓట్ల లెక్కింపు : డిసెంబర్‌ 23

English summary
After winning 12 of the 14 Lok Sabha seats in Jharkhand, the Bharatiya Janata Party (BJP) is determined to go it alone in the upcoming assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X