వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో బీజేపీకి చుక్కలు-ఏకంగా 80 సిట్టింగ్ లకు నో టికెట్-మరో 12 మంది సీట్ల మార్పు

|
Google Oneindia TeluguNews

యూపీలో మరోసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చూస్తున్న బీజేపీకి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా యోగీ సర్కార్ పై ప్రజా వ్యతిరేకతకు తోడు స్ధానికంగా బీజేపీ ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత కూడా ఈసారి తమ కొంప ముంచేలా ఉందని భావిస్తున్న కాషాయ సేన.. ఈసారి టికెట్ల కేటాయింపులో సంచలన నిర్ణయాలు తీసుకుంటోంది.

403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో ఈసారి బీజేపీ గెలిచి తీరాలంటే కచ్చితంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల సీట్లలో పలు మార్పులు చేయక తప్పని పరిస్ధితి ఏర్పడింది. అయితే భారీ సంఖ్యలో మార్పులు చేస్తే తప్ప బీజేపీ గెలుపు కష్టమనే అంచనాలతో కాషాయ పార్టీ అందుకు సిద్ధమవుతోంది. దీంతో ఏకంగా 80 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరిస్తోంది.

bjp may drop 80 sitting mlas, seats change for 12 mlas in uttar pradesh assembly elections

త్వరలో బీజేపీ చివరి అభ్యర్ధుల జాబితా విడుదల కానుండగా... ఇందులో 80 మంది సిట్టింగ్ లను మార్చేందుకు నేతలు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరో 12 స్ధానాల్లో అభ్యర్ధుల్ని ఇతర సీట్లకు మార్చబోతున్నారు. తద్వారా ప్రజా వ్యతిరేకతను అధిగమించేందుకు యోగీ సర్కార్ వ్యూహాలు రచిస్తోంది.

నిన్న ఢిల్లీలో సమావేశమైన బీజేపీ కోర్ కమిటీ ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలు కూడా హాజరయ్యారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ప్రధాని మోడీ ఆధ్వర్యంలోని కేంద్ర ఎన్నికల కమిటీకి పంపుతున్నారు. ఈ కమిటీ ఇవాళ సమావేశమై యూపీ అభ్యర్ధుల తుది జాబితాను ఖరారు చేయనుంది. ఊహించినట్లుగానే బీజేపీ భారీ మార్పులకు ప్రయత్నిస్తే అప్పుడు నేతల వలసలు కూడా పెరుగుతాయనే అంచనాలు కూడా ఉన్నాయి.

English summary
bjp has decisied to drop almost 80 sitting mlas from current list of canidates in uttar pradesh assembly elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X