వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి శ్రీరాములు పోటీ ? సిట్టింగ్ ఎంపీకి షాక్, హైకమాండ్ ఒత్తిడి: ఎలా!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలోని కోప్పళ లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో బీజేపీ నాయకులు సతమతం అవుతున్నారు. కోప్పళ సిట్టింగ్ ఎంపీ సంగణ్ణ కరడి (బీజేపీ)కి టిక్కెట్ ఇవ్వకూడదని ఆ పార్టీకి చెందిన స్థానిక నాయకులు, కార్యకర్తలు డిమాండ్ చెయ్యడంతో అధిష్టానం ఆలోచనలో పడింది.

సీఎం మీద ఈసీకి ఫిర్యాదు చేసిన సుమలత, ఫ్యాన్ ట్యాపింగ్, ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ నిఘా!సీఎం మీద ఈసీకి ఫిర్యాదు చేసిన సుమలత, ఫ్యాన్ ట్యాపింగ్, ఇంటి చుట్టూ ఇంటెలిజెన్స్ నిఘా!

కోప్పళ లోక్ సభ నియోజక వర్గం ఎన్నికలు రెండవ విడతలో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన జరగనున్నాయి. కర్ణాటక బీజేపీ నాయకులు ఇంకా కోప్పళ లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థి పేరు ప్రకటించలేదు. కర్ణాటకలోని సిట్టింగ్ బీజేపీ ఎంపీలకు ఇప్పటికే టిక్కెట్లు కేటాయించారు. అయితే కోప్పళ లోక్ సభ నియోజక వర్గం అభ్యర్థి పేరు మాత్రం ప్రకటించలేదు.

శ్రీరాములుకు టిక్కెట్ ?

శ్రీరాములుకు టిక్కెట్ ?

కోప్పళ లోక్ సభ నియోజక వర్గం బరిలో సిట్టింగ్ ఎంపీ సంగణ్ణ, సీబీ. చంద్రశేఖర్, డాక్టర్ కే. బసవరాజ్ పేర్లు తెరమీదకు వచ్చాయి. అయితే బీజేపీ నాయకులు మాత్రం ఈ ముగ్గురు నాయకులను కాదని మాళకాల్మూరు ఎమ్మెల్యే బళ్లారి శ్రీరాములుతో పోటీ చేయించాలని ఆసక్తి చూపిస్తున్నారు.

హైకమాండ్ ఒత్తిడి

హైకమాండ్ ఒత్తిడి

కోప్పళ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చెయ్యడం శ్రీరాములుకు ఇష్టం లేదని తెలిసింది. అయితే కోప్పళ నుంచి పోటీ చెయ్యడానికి సిద్దంగా ఉండాలని శ్రీరాములు మీద హైకమాండ్ ఒత్తిడి చేస్తున్నదని సమాచారం. కోప్పళ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి శ్రీరాములు ఆసక్తి చూపించడం లేదని, ఈ విషయంలో వేచి చూడాలని ఆయన సన్నిహితులు అంటున్నారు.

ఢిల్లీలో నాయకుల చర్చ !

ఢిల్లీలో నాయకుల చర్చ !

కర్ణాటకలోని 26 లోక్ సభ నియోజక వర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించారు. అయితే సిట్టింగ్ ఎంపీ ఉన్న కోప్పళ నియోజక వర్గంలో అభ్యర్థి పేరు ప్రకటించడంలో ఆచితూచి వేచిచూస్తున్నది. ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో కోప్పళ లోక్ సభ నియోజక వర్గం నుంచి శ్రీరాములుతో పోటీ చేయించాలని బీజేపీ నాయకులు చర్చించారని తెలిసింది. 2014 లోక్ సభ ఎన్నికల్లో బళ్లారి నియోజక వర్గం నుంచి పోటీ చేసిన శ్రీరాములు ఎంపీ అయ్యారు. 2018 శాసన సభ ఎన్నికల్లో మాళకాల్మూరు శాసన సభ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యే అయిన శ్రీరాములు ఎంపీ పదవికి రాజీనామా చేశారు.

రాజకీయ అంచనాలు

రాజకీయ అంచనాలు

బళ్లారి శ్రీరాములును కోప్పళ లోక్ సభ నియోజక వర్గం నుంచి పోటీ చేయిస్తే అనేక విదాలుగా తమకు లాభం ఉంటుందని బీజేపీ నాయకులు అంచనాలు వేస్తున్నారు. కోప్పళ, బళ్లారి, రాయచూరు, హావేరి, గదగ్, బాగల్ కోటే నియోజక వర్గాల్లో శ్రీరాములు కారణంగా పార్టీకి మేలు జరుగుతుందని కర్ణాటక బీజేపీ నాయకులు అంచనా వేస్తున్నారు. కోప్పళ లోక్ సభ నియోజక వర్గం సిట్టింగ్ ఎంపీ సంగణ్ణ కరడికి మాత్రం టిక్కెట్ ఇవ్వకూడదని బీజేపీ కార్యకర్తలు పట్టుబడుతున్నారు.

కాంగ్రెస్, బీజేపీ

కాంగ్రెస్, బీజేపీ

కోప్పళ లోక్ సభ నియోజక వర్గం తమ పార్టీ అభ్యర్థి రాజశేకర్ హిట్వాళ్ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటి వరకు ఆ పార్టీ అభ్యర్థి పేరు ప్రకటించలేదు. మరో వైపు ఈ సారి తనకు టిక్కెట్ ఇవ్వాలని బీజేపీ సిట్టంగి ఎంపీ సంగణ్ణ కరడి హైకమాండ్ కు మనవి చేశారు. టిక్కెట్ సంపాధించుకోవడం కోసం సంగణ్ణ కరడి అనేక విదాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
BJP may file former minister and Molakalmuru MLA B.Sriramulu from Koppal lok sabha seat. Sitting MP Sanganna Karadi may miss ticket.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X