వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బిజెపి మద్దతు, అధిష్టానం బెదిరిస్తే లొంగం: హర్షకుమార్

By Srinivas
|
Google Oneindia TeluguNews

 Harsha Kumar
న్యూఢిల్లీ: తమ అవిశ్వాస తీర్మానానికి భారతీయ జనతా పార్టీ మద్దతు ఉంటుందని, అధిష్టానం బెదిరింపులకు లొంగేదిలేదని అమలాపురం పార్లమెంటు సభ్యులు హర్షకుమార్ బుధవారం అన్నారు. అవిశ్వాస తీర్మానం మద్దతు కోసం సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు మద్దతు కూడగడుతున్నారు.

ఈ సందర్భంగా హర్షకుమార్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు. తాము అధిష్టానం బెదిరింపులకు లొంగే ప్రసక్తి లేదన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు తిట్టినప్పుడు ఇప్పుడు తమను అంటున్న ఎంపీలు పొన్నం ప్రభాకర్, రాజయ్యలు ఏం చేశారన్నారు.

తెరాసలో కడియం శ్రీహరి, వినోద్‌లు లేకుంటే పొన్నం, రాజయ్యలు ఎప్పుడో ఆ పార్టీలో చేరేవారన్నారు. అలాంటి వారు ఇప్పుడు తమను విమర్శించడం హాస్యాస్పదన్నారు. తాము పార్టీని మారమని, కాంగ్రెసులో ఉంటూనే తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎత్తి చూపుతామన్నారు.

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇంకా కాంగ్రెసును వీడలేదని, పార్టీని పెట్టలేదని, అలాంటప్పుడు ఆ పార్టీలో చేరుతారా అనేది ఊహాజనితమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమ ధిక్కారం పార్టీ నిర్ణయం పైనే తప్ప పార్టీ పైన కాదన్నారు.

ప్రభుత్వానికి కొనసాగే హక్కు లేదు: లగడపాటి

ప్రజల విశ్వాసం కోల్పోయిన యూపిఏకు కొనసాగే హక్కు లేదని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. తాము సమైక్యాంధ్ర మినహా మరొకటి ఒప్పుకునేది లేదని చెప్పారు.

English summary
Amalapuram MP Harsha Kumar on Wednesday said BJP may give support to their No Confidence Motion in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X