అమిత్ షాను చంపేస్తాం.. బీజేపీ ఎమ్మెల్యేకు బెదిరింపు లేఖ..
విదిశ : బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను చంపేస్తామంటూ బీజేపీ ఎమ్మెల్యేకు అందిన బెదిరింపు లేఖ కలకలం రేపింది. మధ్యప్రదేశ్‌లోని విదిశ జిల్లా గంజ్ బసోడా నియోజకవర్గ ఎమ్మెల్యే లీనా జైన్‌కు సోమవారం పోస్టులో ఓ ఉత్తరం వచ్చింది. అందులో ఎమ్మెల్యే లీనాతో పాటు కేంద్రం హోం శాఖ మంత్రి అమత్ షాను హతమారుస్తానంటూ ఆగంతకుడు హెచ్చరించాడు. దీంతో భయభ్రాంతులకు గురైన ఆ మహిళా ఎమ్మెల్యే పోలీసులను ఆశ్రయించారు. బెదిరింపు లేఖకు సంబంధించి ఫిర్యాదు చేశారు.
చేతితో రాసిన లెటర్‌లో అమిత్ షా ఎప్పుడు గంజ్ బసోడాకు వచ్చినా అతన్ని చంపేస్తామని ఆగంతకుడు బెదిరించాడు. అమిత్ షా, లీనా జైన్‌ను హతమార్చడంతో పాటు గంజ్ బసోడా బస్టాండ్, రైల్వే స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్‌లను బాంబులతో పేల్చేస్తామని హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు పట్టణంలో భద్రత కట్టుదిట్టం చేశారు. బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. బెదిరింపు లేఖ అందుకున్న బీజేపీ మహిళా ఎమ్మెల్యే లీనా జైన్‌కు సెక్యూరిటీ పెంచారు.

ఆగంతకుని లేఖపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పలు చోట్ల గస్తీ ముమ్మరం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్, ప్రభుత్వ హాస్పిటల్‌లతో పాటు రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబు డిస్పోజబుల్ స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహిస్తున్నారు. మతి స్థిమితంలేని వ్యక్తి ఈ లేఖ రాసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.
-
మందు బాబులకు బిగ్ షాక్.. 2 రోజులు వైన్స్ బంద్.. -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్!












Click it and Unblock the Notifications