5కోట్ల కారుతో అసెంబ్లీకి వచ్చిన బీజేపీ ఎమ్మెల్యే: మహారాష్ట్రలో హాట్ టాపిక్

లగ్జరీ కారుతో ఎమ్మెల్యేను చూడగానే మీడియా ప్రతినిధులు కెమెరాలకు పనిచెప్పారు. కాగా, ఈ లగ్జరీ కారును సదరు ఎమ్మెల్యే గతంలో తన భార్యకు బహుమతిగా కొనిచ్చారు.

ముంబై: అత్యంత విలాసవంతమైన కారుతో ఓ ఎమ్మెల్యే అసెంబ్లీకి రావడం మహారాష్ట్రలో హాట్ టాపిక్ గా మారింది. థానే జిల్లా భయందర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతా గురువారం నాడు ల్యామ్ బోర్గి కారుతో అసెంబ్లీ ప్రాంగణంలో సందడి చేశాడు.

లగ్జరీ కారుతో ఎమ్మెల్యేను చూడగానే మీడియా ప్రతినిధులు కెమెరాలకు పనిచెప్పారు. కాగా, ఈ లగ్జరీ కారును సదరు ఎమ్మెల్యే గతంలో తన భార్యకు బహుమతిగా కొనిచ్చారు. ఈ కారు విలువ సుమారు 5.5కోట్లు ఉంటుందని అంచనా. ఇదే కారుతో ఆమె ఓ రోడ్డు ప్రమాదానికి కూడా కారణమవడం అప్పట్లో వివాదస్పదమైంది. అయితే బాధితుడైన ఆటో డ్రైవర్ కు నష్టపరిహారం చెల్లించడంతో వివాదం అక్కడితో సద్దుమణిగింది.

BJP MLA drives Lamborghini to Maharashtra legislature; wife had crashed car into auto

కాగా, ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలోను ఎమ్మెల్యే నరేంద్ర మెహతా ఎక్కువ సేపు గడపలేదు. అసెంబ్లీకి వచ్చిన కొద్దిసేపటికే ఆయన వెనుదిరిగారు. మొత్తానికి ఎమ్మెల్యే గారి కారు అసెంబ్లీ ప్రాంగణంలో పలువురిని ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+