కలకలం: ఇంటికొచ్చి బిజెపి ఎమ్మెల్యేపై కాల్పులు

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో బుధవారం ఉదయం ఓ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేపై జరిగిన కాల్పులు కలకలం సృష్టించాయి. బిజెపి ఎమ్మెల్యే జితేందర్ సింగ్ షుంటీపై ఓ దుండగుడు వివేక్ విహార్‌లోని అతని ఇంటికొచ్చి కాల్పులకు తెగపడ్డాడు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కాల్పుల నుంచి ఎమ్మెల్యే తప్పించుకున్నారు.

ఈ ఘటన బుధవారం 6గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. వివేక్ విహార్‌లోని ఝిల్మిల్ కాలనీలో ఉన్న జితేందర్ ఇంటికి వచ్చిన బైక్‍పై వచ్చిన ఇద్దరు దుండగులు అతడిపై పలుమార్లు కాల్పులకు తెగపడ్డారు.

BJP MLA Jitender Singh Shunty shot at in Delhi, escapes unhurt

బైక్‍పై వచ్చిన ఇద్దరు దుండగులు పలు పత్రాలపై సంతకం కావాలని ఎమ్మెల్యేను ఆయన ఇంటిముందు కలిశారు. ఆ తర్వాత ఘర్షణకు దిగిన దుండగులు అతనిపై నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. అయితే వాటి నుంచి ఆయన తప్పించుకున్నారు. సహాయం కోసం ఆయన తన ఇంటి తలుపులు తీయడంతో అక్కడ్నుంచి దుండగులు పరారయ్యారు.

జితేందర్ సింగ్ షుంటీ ఢిల్లీలోని షాహ్దరా అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. కాల్పులు ఘటన మొత్తం ఆయన ఇంటిముందు ఏర్పాటు చేసిన సిసిటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. సమాచారం అందుకున్న పోలీసులు, నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+