మహిళల బట్టల వల్లే అత్యాచారాలు: ప్రియాంకాగాంధీ బికినీ వ్యాఖ్యలపై బిజెపి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
కర్ణాటకలో హిజాబ్ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రేణుకాచార్య తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మరో రగడకు తెరలేపారు. మహిళలు ధరించే దుస్తుల వల్లే అత్యాచారాలు పెరుగుతున్నాయని కర్ణాటక బిజెపి ఎమ్మెల్యే రేణుకాచార్య షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.
Recommended Video

ప్రియాంకా బికినీ ట్వీట్ కు బీజేపీ ఎమ్మెల్యే కౌంటర్
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ 'బికినీ' ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ కర్ణాటకలో హిజాబ్ వివాదం నేపథ్యంలో "అది బికినీ అయినా, ఘూంగ్‌హాట్ అయినా, ఒక జత జీన్స్ అయినా లేదా హిజాబ్ అయినా, ఆమె ఏమి ధరించాలో నిర్ణయించుకోవడం ఒక మహిళ యొక్క హక్కు అని పేర్కొన్నారు . మహిళకు ఏది కావాలంటే అది ధరించే హక్కు భారత రాజ్యాంగం కల్పించిందని ప్రియాంక గాంధీ అన్నారు. ఈ హక్కు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడింది. మహిళలను వేధించడం మానేయండి అని ప్రియాంక గాంధీ పేర్కొన్నారు.

ప్రియాంక బికినీ వ్యాఖ్యలు దిగజారుడుతనాన్ని సూచిస్తున్నాయి
ప్రియాంక గాంధీ వ్యాఖ్యలకు కౌంటర్ గా రేణుకాచార్య మాట్లాడుతూ.. 'బికినీ' అనే పదం వాడటం నీచమైన ప్రకటన అంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రియాంక గాంధీ ఎంతగా దిగజారిపోయాయో అర్థం చేసుకోవచ్చన్నారు. కాలేజీలో చదివేటప్పుడు పిల్లలకు పూర్తిగా బట్టలు వేయాలి. ఆడవాళ్ల బట్టల వల్లే నేడు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మగవాళ్ళు రెచ్చిపోతున్నారు. ఇది సరికాదన్నారు. మన దేశంలో మహిళలకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని కాపాడేలా మహిళలు దుస్తులు ధరించాలని బిజెపి ఎమ్మెల్యే రేణుకాచార్య పేర్కొన్నారు

రాజకీయ దుమారంగా మారిన కర్ణాటకలో హిజాబ్ గొడవ ..
అంతకుముందు రోజు కర్ణాటక ఇంధన శాఖ మంత్రి సునీల్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే, హిందువులు హిజాబ్ ధరించేలా చట్టం చేస్తారని చెప్పారు. కర్ణాటకలోని కోస్టల్ టౌన్ ఉడిపిలోని ప్రభుత్వ ప్రీ-యూనివర్శిటీ కళాశాల యాజమాన్యం హిజాబ్ ధరించినందుకు ఆరుగురు ముస్లిం బాలికలను తరగతులకు హాజరుకాకుండా నిషేధించడంతో జనవరి 1న కర్ణాటక హిజాబ్ గొడవ ప్రారంభమైంది. కళాశాలలో కి హిజాబ్ ను అనుమతించకపోవడంతో విద్యార్థినులు చేపట్టిన ఆందోళన పెను దుమారాన్నే రేపింది. మూడు రోజుల పాటు కాలేజీలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించేదాకా వెళ్లింది పరిస్థితి. ఈ విషయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారి రాజకీయ దుమారం రేపుతోంది.












Click it and Unblock the Notifications