వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాకు యూనియన్లు కావాలి... యూపీలో అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల ధర్నా...!

|
Google Oneindia TeluguNews

దేశంలో అటెండర్ల నుండి ఐపిఎస్, ఐఏఎస్‌లు మొదలుకుని వ్యాపారస్థులు, చివరకు రైతులకు కూడ సంఘాలు, యూనియన్లు ఉన్నాయి...మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు కూడ ఓ సంఘం ఉండాలి.. ఎమ్మెల్యేల హక్కులను కాపాడుకునేందుకు యూనియన్లు ఉంటే తప్పేమిటనే ఎమ్మెల్యేల వాదన. ఇందుకోసం అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సైతం ఏకమయిన సంఘటన అసెంబ్లీ సమావేశాల్లో నెలకొంది.

ఎమ్మెల్యేల హక్కుల కోసం సభలో ఆందోళన

ఎమ్మెల్యేల హక్కుల కోసం సభలో ఆందోళన

సాధారణంగా రాజకీయాల్లో అధికార ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు ఉంటాయి. ఒకరికొకరు ఎప్పుడు రాజకీయాంగా వారిని ఇరుకున పెట్టాలా.. అనే కోణంలో వారి ఆలోచనలు ఉంటాయి. దీంతో అదను కోసం వేచి ఉంటారు. ప్రత్యేకంగా అసెంబ్లీలో అయితే... నేరుగా అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు దుమ్మెత్తిపోసుకుంటారు. అయితే యూపీలో మాత్రం ఓ అరుదైన సంఘటన జరిగింది. అధికార పార్టీ ఎమ్మెల్యే సమస్యకు ప్రతిపక్ష పార్టీల సభ్యులు బహిరంగ మద్దతు పలికారు. అంతేకాదు ఆ ఎమ్మెల్యే కోసం ఏకంగా నాలుగు గంటలపాటు అసెంబ్లీలోనే బైఠాయించి ఆందోళన చేశారు.

యూపీలో కలిసి పోయిన అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు

యూపీలో కలిసి పోయిన అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు

ఈ విచిత్ర సంఘటన యూపీలో జరిగింది. ప్రస్తుతం యూపీలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంతో సభలోనే అధికార పార్టీకి చెందిన ఘజియాబాద్ ఎమ్మెల్యే నంద్‌కిషోర్ గుర్జరర్ మాట్లాడుతూ...పోలీసులు , మరియు ఇతర అధికారులు తనను వేధిస్తున్నారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరడంతో అందుకోసం స్పీకర్ అనుమతించలేదు. అయినా... ఆయన మాట్లాడుతుంటే స్పీకర్ అడ్డుకున్నారు. దీంతో అధికార పార్టీ ఎమ్మెల్యే సభలోనే ధర్నాకు దిగారు. ఇక ఆయనకు తోడుగా ప్రతిపక్ష, ఎస్పీ , కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం మద్దతు తెలిపారు. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వాలంటూ..సభలో నినాదాలు చేశారు.

సభలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన

సభలో అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన

ఆందోళన నేపథ్యంలో స్పీకర్ సభను వాయిదా వేసి బయటకు వెళ్లిపోయారు. దీంతో ఆగ్రహించిన సుమారు వందమంది అధికార , ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సభలోనే ఆందోళన నిర్వహించారు. సుమారు నాలుగు గంటలపాటు సభలోనే నిరసన వ్యక్తం చేశారు. దీంతో దిగివచ్చిన పార్టీ సీనియర్ మంత్రులు, స్పీకర్ సైతం సభలోకి వచ్చి వారికి నచ్చజెప్పారు. అనంతరం వారి ఆందోళన విరమించేలా చర్యలు తీసుకున్నారు. దీంతో శాంతించిన అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఆందోళన విరమించి బయటకు వచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేల అందోళనకు కొంతమంది ఫేస్‌బుక్‌ ద్వార కూడ తమ మద్దతు తెలిపారు.

ఎమ్మెల్యేలకు యూనియన్లుండాలి... !

ఎమ్మెల్యేలకు యూనియన్లుండాలి... !

ఎమ్మెల్యేల ఆందోళనకు ఫేస్‌బుక్‌లో మద్దతు తెలుపుతూ.. తమకు యూనియన్లు ఉండాలని బీజేపీ ఎమ్మెల్యే శ్యాంప్రకాశ్ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు..దేశంలో అటెండర్ల నుండి ఐపిఎస్, ఐఏఎస్‌లు మొదలుకుని వ్యాపారస్థులు, చివరకు రైతులకు కూడ సంఘాలు, యూనియన్లు ఉన్నాయి...మరి అలాంటప్పుడు ఎమ్మెల్యేలకు కూడ ఓ సంఘం ఉండాలి.. ఎమ్మెల్యేల హక్కులను కాపాడుకునేందుకు యూనియన్లు ఉంటే తప్పేమిటనే వినూత్న వాదనతో ఆయన పోస్ట్ చేశారు.

నేరాలపై యూపీలో ఉక్కుపాదం

నేరాలపై యూపీలో ఉక్కుపాదం

ముఖ్యంగా యూపీలో క్రైం రేటు ఎక్కువగా నమోదవుతుంటుంది...ఇందుకు ప్రజాప్రతినిధులు కూడ మినహాయింపు కాదు..దేశవ్యాప్తంగా సంచలన రేపిన ఉన్నావో కేసులో ముద్దాయి కూడ ఎమ్మెల్యే కావడం తెలిసిందే...దీంతో బాధితురాలిపై అత్యచారం చేయడమే కాకుండా... దాడి చేసి నిట్టనిలువునా... కాల్చి వేసిన సంఘటన ఇటివల నెలకొంది. దీంతో పాటు రాష్ట్రంలో పలు సంఘటనల్లో ఎమ్మెల్యేలపై పలు నేరారోపణలు ఉన్న పరిస్థితి నెలకొంది. అయితే ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలన్నా... ఏ చట్టపరంగా చర్యలు తీసుకోవాలన్నా... స్పీకర్ అనుమతి తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంటుంది. మరోవైపు నేరాలపై యూపీ యోగి అధిత్యానాథ్ సైతం ఉక్కుపాదం మోపుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలంతా... స్పీకర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టినట్టు తెలుస్తోంది...

English summary
BJP MLAs staged a dharna against their own government after a ruling party lawmaker accused the present regime of harassing him in the Uttar Pradesh assembly
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X