Ananth Kumar: ఇందిరా, సంజయ్ గాంధీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు..

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, కాంగ్రెస్‌ నాయకుడు సంజయ్‌ గాంధీపై బీజేపీ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందిరా గాంధీ, సంజయ్ గోహత్యతో శాపానికి గురయ్యారని అన్నారు. గోపాష్టమి రోజున ఇందిరాగాంధీని కాల్చి చంపారని పేర్కొన్నారు. గోవధ నిషేధం కోసం కరపత్రి మహరాజ్ భారీగా ఆందోళనలు చేశారని చెప్పారు.

ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు గోహత్య నిషేధంపై పెద్దఎత్తున ఆందోళనలు జరిగాయని గుర్తు చేశారు. ఆ ఉద్యమంలో పదుల సంఖ్యలో సాధువులు చనిపోయారని చెప్పారు. ఎందరో సాధువుల హత్యలు జరిగాయన్నారు. ఇందిరాగాంధీ సమక్షంలో వందలాది గోవులు వధించారని తెలిపారు. అప్పుడే సన్యాసి కర్పాత్రి మహారాజ్ ఇందిరా గాంధీని శపించాడని అనంత్ కుమార్ తెలిపారు."గోపాష్టమి రోజునే మీ వంశం నాశనం అవుతుందని శపించాడు. గోపాష్టమి రోజున సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించాడు. ఇందిరా గాంధీ గోపాష్టమి రోజున కాల్చి చంపారు" అని అనంత్ వ్యాఖ్యలు చేశాడు.

BJP MP Ananth Kumar made controversial comments on former PM Indira Gandhi and Sanjay Gandhi

అనంత్ కుమార్ మసీదుల గురించి కూడా మాట్లాడారు. భత్కల్‌లోని బంగారు గ్రామం విధిని బాబ్రీ మసీదు విధ్వంసంతో అనుసంధానించారు. బాబ్రీ మసీదు ధ్వంసమైనట్లే భత్కల్ మసీదుకూ అదే గతి పడుతుందని వ్యాఖ్యానించారు.బాబ్రీ మసీదు ధ్వంసమైనట్లే, భత్కల్‌లోని బంగారు గ్రామం కూడా దాని వరుసలో చేరుతుందన్నారు. సిరసిలోని సీపీ బజార్‌లో మసీదు ఉండేదని.. దీని స్థానంలో అంతకుముందు విజయ విఠల్ దేవాలయం ఉండేదన్నాడు.

అనంత్ కుమార్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నడ ఎంపీ అనంతకుమార్ హెగ్డే రాజకీయ ప్రయోజనాల కోసం వాడిన భాష ఆయన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య అన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని మారుస్తానని చెప్పిన అనంత్ కుమార్ హెగ్డే నుంచి మంచి సంస్కృతిని ఆశించడం అసాధ్యమేనని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+