Pragya Thakur: కత్తులకు పదును పెట్టండి, ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలీదు, జీహాద్ అంటే !
బెంగళూరు/శివమొగ్గ: హిందూ సమాజం తమ పరువు కాపాడుకోవడానికి, మన సమాజాన్ని (హిందువులను) రక్షించుకోవడానికి కత్తులకు పదును పెట్టాలని మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా కాంగ్రెస్ కమిటీ బిజెపీ ఎంపీ బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ హిందూ మీద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వ్యాఖ్యలై కర్ణాటక కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు.

ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ?
ఆదివారం కర్ణాటకలోని శివమొగ్గలో హిందూ జాగరణ్ వేదిక సౌత్ జోన్ వార్షిక సదస్సులో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మాట్లాడుతూ హిందువులు కత్తులకు పదును పెట్టాలని హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. మీ ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోవాలని, గత్యంతరం లేకపోతే కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా పదును పెట్టండని అన్నారు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో తెలియదని, ఆత్మరక్షణ చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. .

జీహాద్ అంటున్నారు
ఎవరైనా మన ఇంట్లోకి ప్రవేశించి దాడి చేస్తే తగిన సమాధానం చెప్పడం మన హక్కు అని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు. ప్రగ్యా ఠాకూర్ లవ్ జిహాద్ మీద ఆరోపణలు చేశారు. ముస్లీం వర్గానికి జిహాద్ సంప్రదాయం అయ్యిందని ఆరోపించారు. వారు ఏమీ చేయకపోతే వారు లవ్ జిహాద్ చేస్తారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ అన్నారు.
లవ్ జీహాద్ ప్రయోగం
అమాయకులైన హిందూ అమ్మాయిలను ప్రేమించినా అందులో జిహాద్ ప్రయోగిస్తారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ వివాదాస్పాద వ్యాఖ్యలు చేశారు. మనం కూడా దేవుణ్ణి పూజిస్తామని, అయితే మనం భక్తితో దేవుడిని పూజిస్తే వాళ్లు మాత్రం అందులో కూడా జీహాద్ ప్రయోగిస్తారని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

రంగంలోకి దిగిన కాంగ్రెస్
శివమొగ్గ జిల్లా కాంగ్రెస్ కమిటీకి చెందిన హెచ్‌ఎస్. సుందరేష్ ఫిర్యాదు మేరకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ హిందూ మీద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. శివమొగ్గలోని బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మీద పలు సెక్షన్ ల కింద కేసు నమోదైంది. శివమొగ్గ నగరంలోని కోటే పోలీస్ స్టేషన్‌లో బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నామని పోలీసులు అన్నారు. ఇరు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ చేసిన వ్యాఖ్యలను కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఖండించింది.












Click it and Unblock the Notifications