గెలుపుపై సరే, అక్కడ ఓటమిపై మాట్లాడరేం?: బీజేపీకి అఖిలేష్ ప్రశ్న
లక్నో: బీజేపీ అబద్ధాలు ప్రచారం చేస్తోదంటూ సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించామని గప్పాలు కొడుతున్న బీజేపీ ఓటమి చెందిన స్థానాలపై నోరు మెదపదేమని ప్రశ్నించారు.
సోమవారం ఓ వివాహానికి హాజరైన సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కారణం ఈవీఎంల మాయాజాలమేనంటూ విమర్శించారు.
భారత్ కన్నా మిన్నగా అభివృద్ధి చెందిన ఎన్నో దేశాల్లో ఎన్నికల్లో ఇప్పటికీ బ్యాలట్ పత్రాలనే ఉపయోగిస్తున్నారని, అలాంటప్పుడు భారత్ లో ఈవీఎంల వాడకం ఎందుకని ప్రశ్నించారు.

చెడిపోయిన ఈవీఎంను ఎలా మరమ్మతు చేస్తున్నారన్న విషయమై ఎన్నికల సంఘం వివరణ ఇవ్వాలని అఖిలేష్ యాదవ్ డిమాండ్ చేశారు. చెడిపోయిన ఈవీఎంలను మరమ్మతు చేయగలిగినప్పుడు బాగా పనిచేసే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయగలిగే అవకాశం లేదా? అని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఈవీఎంల వినియోగం, ఈవీఎంల ట్యాంపరింగ్ వంటి విషయాలపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, సమాజ్‌వాదీ, ఆప్ తీవ్రంగా దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఓటింగ్ కు ఈవీఎంలపై ఆధారపడకుండా ఇతర ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఈ పార్టీలు ఎప్పట్నించో డిమాండ్ చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications