బీజేపీ ఓటమీ ఖాయం, కేంద్రంపై ప్రజల్లో ఆగ్రహం ఉంది : ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ జాతీయ కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రధాని నరేంద్రమోడీపై మరోసారి ఫైర్ అయ్యారు. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని అన్నారు. ప్రభుత్వ విధానాలపై ప్రజలు విసిగి పోయారని ఆమే ధ్వజమెత్తారు. అసలు విషయాలను పక్కన పెట్టిన అనవసర విషయాలను మోడీ ప్రస్థావిస్తున్నారని ఆమే విమర్శించారు.
నేడు జరుగుతున్న ఆరవ విడత ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం ఆమే మీడీయాతో మాట్లాడారు. ఈనేపథ్యంలోనే ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని ఆమే పేర్కోంది. ప్రభుత్వ హయాంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. ఇక మోడీ ప్రజా సమస్యల గురించి ప్రస్థావించకుండా ఎన్నికల్లో లబ్ధిపోందే విధంగా ఇతర విషయాలను మాట్లాడుతున్నాడని ఆరోపించారు. ఇందుకోసమే ప్రజలు అగ్రహంగా ఉన్నారని తెలిపారు. వారి ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో తెలుపుతారని వ్యాఖ్యానించారు.

ఓటును వినియోగించుకున్న నేపథ్యంలోనే ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు తాము పోరాడుతున్నామని, దేశ పరిస్థితుల నుండి బాగుపడేందుకే ఓటును వేశానని అన్నారు. కాగా ప్రియాంక సర్ధార్ పటేల్ విద్యాలయాంలోని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఇక యూపీఎ చైర్ పర్సన్ సోనియా గాంధి నిర్మాణ్ భవన్ లో ఓటు హక్కును వినియోగించుకోగా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధి నడుచుకుంటూ వచ్చి న్యూ ఢిల్లిలోని ఔరంగజేబ్ లేన్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.












Click it and Unblock the Notifications