Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజ్యసభ ఎన్నికలు: 14 మంది అభ్యర్థులతో బీజేపీ జాబితా, ఏ రాష్ట్రం నుంచి ఎవరంటే?

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల నామినేషన్లకు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. తాజాగా, భారతీయ జనతా పార్టీ ఏడు రాష్ట్రాల్లో 14 మంది పేర్లను ఎంపిక చేసి ఆదివారం రాత్రి విడుదల చేసింది. దీంట్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి ఏడుగురు, బీహార్ నుంచి ఇద్దరు, ఛత్తీస్‌గఢ్, హర్యానా, కర్ణాటక, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు.

రాష్ట్రాల నుంచి అభ్యర్థుల వివరాలు:

ఉత్తరప్రదేశ్ నుంచి ఆర్పీఎస్ సింగ్, డా. సుధాన్షు త్రివేది, చౌదరి తేజ్ వీర్ సింగ్, సాధనా సింగ్, అమర్ పాల్ మౌర్య, సంగీత బల్వంత్, నవీన్ జైన్

BJP releases 14 candidate list for Rajya Sabha election

బీహార్ నుంచి డా. ధర్మశీల గుప్తా, భీమ్ సింగ్
ఛత్తీస్‌గఢ్ నుంచి రాజా దేవేంద్ర ప్రతాప్ సింగ్
హర్యానా నుంచి సభాష్ బరాలా
కర్ణాటక నుంచి నారాయణ కష్టస భండగే
ఉత్తరాఖండ్ నుంచి మహేంద్ర భట్
పశ్చిమబెంగాల్ నుంచి సమిక్ భట్టాచార్య.

దేశ వ్యాప్తంగా 15 రాష్ట్రాల నుంచి ఏప్రిల్ నెలలో ఖాళీ అయ్యే 56 రాజ్యసభ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నికలకు దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమైంది. ఫిబ్రవరి 15తో ముగియనుంది. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహించి అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాలు విడుదల చేస్తారు.

కాగా, అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 10 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇక, బీహార్ 6, మహారాష్ట్ర 6, పశ్చిమబెంగాల్ 5, మధ్యప్రదేశ్ 5, గుజరాత్ 4, కర్ణాటక 4, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో మూడేసి చొప్పున స్థానాలకు, హర్యానా, ఛత్తీస్‌గఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఒక్కో రాజ్యసభ స్థానానికి ఎన్నిక జరగనుంది. కాగా, ఆదివారంనాడే టీఎంసీ కూడా నలుగురి పేర్లతో జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+