వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రంప్ నిర్ణయం: బీజేపీ ఎంపీ ఆదిత్యనాథ్ సంచలనం

ముస్లీం మెజార్టీ దేశాల పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పైన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ స్పందించారు.

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ముస్లీం మెజార్టీ దేశాల పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ విధించిన ట్రావెల్ బ్యాన్ పైన బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ట్రంప్ నిర్ణయాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ అదిత్యనాథ్ మాత్రం ప్రశంసించారు.

<strong>భయపడిందే జరిగింది: ట్విస్ట్.. అమెరికా ఉద్యోగ భర్తీకి కాదు కానీ..</strong>భయపడిందే జరిగింది: ట్విస్ట్.. అమెరికా ఉద్యోగ భర్తీకి కాదు కానీ..

ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు ఇది మంచి నిర్ణయమన్నారు. భారత్ కూడా ట్రంప్‌లానే వ్యవహరించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో బులంద్‌షహర్‌లో ప్రచారం నిర్వహించారు.

yogi adityanath

భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నిర్మూలించేందుకు భారత్ కూడా ట్రంప్ వంటి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. మూడు దశాబ్దాలుగా పశ్చిమ యూపీలోని పరిస్థితులు కాశ్మీర్‌ పరిస్థితులను తలపిస్తున్నాయన్నారు.

ముజఫర్‌నగర్, మీరట్, ఘజియాబాద్‌లోనూ ఇటువంటి పరిస్థితులే నెలకొన్నాయన్నారు. అధికార సమాజ్‌వాదీ పార్టీ విధానాలతోపాటు బీఎస్పీ విధానాలే ఇందుకు కారణమన్నారు.1990లో కాశ్మీర్‌లో జరిగిందే ఇప్పుడు యూపీలో జరుగుతోందన్నారు. కాశ్మీర్ లోయను కోల్పోయాం కానీ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌ను మాత్రం కోల్పోయేది లేదన్నారు.

English summary
Firebrand BJP leader Yogi Adityanath today applauded Donald Trump's immigration order that bans travellers from seven Muslim-majority countries and stressed the need for such action in India.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X