వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేడీయూకి ఓటు వేసినందుకు వృద్దుడిపై ఆర్జేడీ దాడి.. వీడియో షేర్ చేసిన బీజేపీ..

|
Google Oneindia TeluguNews

బిహార్‌లో మూడో విడత పోలింగ్ సందర్భంగా ఓ వృద్దుడిపై దాడి కలకలం రేపుతోంది. ఎన్నికల్లో జేడీయూకి ఓటు వేసినందుకు ఆర్జేడీ కార్యకర్తలు తనను చితకబాదారని ఓ వృద్దుడు ఆరోపించాడు. దీనికి సంబంధించిన వీడియోను బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాళవియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఆర్జేడీ అంటేనే గూండారాజ్యం అని ఆ వీడియోకి తన కామెంట్‌ను జతచేశారు. మాధెపురా అసెంబ్లీ నియోజకవర్గంలో జేడీయూ గుర్తు బాణానికి ఓటు వేసినందుకు ఆర్జేడీ కార్యకర్తలు వృద్దుడిపై దాడికి పాల్పడ్డాడరని అమిత్ మాళవియా ఆరోపించారు. మాళవియా షేర్ చేసిన ఆ వీడియోలో.. వృద్దుడు ఏడుస్తుండటం గమనించవచ్చు.

Recommended Video

Bihar Election 3 Phase : వృద్దుడిపై దాడి కలకలం... BJP IT Cell Chief shared A video

కొద్దిరోజుల క్రితం ఆర్జేడీ కూడా తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో బీజేపీకి సంబంధించిన ఓ వీడియోని షేర్ చేసింది. ఆ పార్టీ కార్యకర్తలు ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని... ఓటమి భయంతోనే ప్రలోభాలకు దిగుతున్నారని ఆరోపించింది. 'ఇది బిహార్ సార్... డబ్బులతో మీరు బిహారీలను కొనలేరు..' అని పేర్కొంది.

BJPs Amit Malviya claims elderly man thrashed by RJD supporters for voting jdu

బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అక్టోబర్ 28 నుంచి మూడు విడతలుగా పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం(నవంబర్ 7) జరుగుతున్న చివరి విడతగా జరుగుతున్న చివరి విడత ఎన్నికల్లో మొత్తం 78 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 1,204 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఛత్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ బీజేపీ నేత,దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బంధువు నీరజ్ కుమార్ సింగ్‌తో పాటు బిహారీగంజ్‌ నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి శరద్ యాదవ్ కుమార్తె,కాంగ్రెస్ అభ్యర్థి సుభాషిణి శరద్ యాదవ్,బిహార్ అసెంబ్లీ స్పీకర్,జనతాదళ్ అభ్యర్థి వినయ్ కుమార్ చౌదరి,ముజఫర్‌పూర్ నుంచి పోటీ చేస్తున్న పట్టణాభివృద్ది శాఖ మంత్రి,బీజేపీ అభ్యర్థి సురేశ్ కుమార్ శర్మల భవితవ్యాన్ని ఈ ఎన్నికల్లో ఓటర్లు డిసైడ్ చేయనున్నారు.

చాలా పార్టీలు బరిలో నిలిచినప్పటికీ ప్రధాన పోటీ ఎన్డీయూ-మహాకూటమి మధ్యే ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ రెండు కూటములు ఎవరికి వారే గెలుపుపై ధీమాతో ఉన్నారు. ఇరువురిలో అంతిమ విజయం ఎవరిదో తెలియాలంటే నవంబర్ 10 వరకు వేచి చూడాల్సిందే.

English summary
BJP IT Cell chief Amit Malviya shared a video of an elderly man who has allegedly thrashed by RJD supporters because he voted for Nitish Kumar’s JD(U).In the video, the man can be seen saying he was beaten up because he backed JD(U).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X