Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

త్రిపురలో 48 మందితో బీజేపీ తొలి జాబితా-మాజీ సీఎం విప్లవ్ కు షాక్-కేంద్రమంత్రి ప్రతిమకు చోటు

త్రిపురలో వచ్చే నెల 16న జరిగే అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటికే పొత్తులపై అన్ని పార్టీలు దృష్టిసారించి ముమ్మర చర్చలు జరుపుతున్నాయి. అదేసమయంలో గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగి గెలిచిన బీజేపీ ఈసారి కూడా పొత్తులు కుదరకపోవడంతో ఒంటరి పోరుకు సిద్ధమైంది. దీంతో 48 మంది అభ్యర్ధులతో బీజేపీ ఇవాళ తన తొలి జాబితాను విడుదల చేసింది. మరో 12 మంది అభ్యర్ధుల్ని రెండో జాబితాలో ఖరారు చేయబోతోంది.

ఇవాళ విడుదల చేసిన బీజేపీ త్రిపుర అసెంబ్లీ ఎన్నికల తొలిజాబితాలో 48 మంది అభ్యర్ధులకు చోటు దక్కింది. ఇందులో ఇద్దరు ముస్లింలకు కూడా బీజేపీ చోటు కల్పించింది. అలాగే మాజీ సీఎం విప్లవ్ కుమార్ దేవ్ కు ఈ జాబితాలో బీజేపీ చోటు కల్పించలేదు. గతంలో అర్ధాంతరంగా ఆయన్ను సీఎంగా తప్పించిన బీజేపీ... ఈసారి ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వకపోతే భారీ షాక్ కానుంది. మరోవైపు కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ కు ఈసారి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు.

bjps first list out for tripura assembly elections 2023, no ticket for ex cm biplab deb

బీజేపీ తొలి జాబితాలో 21 మంది పాత వారికే టికెట్లు కేటాయించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ భట్టాచార్జీ గతసారి మాజీ సీఎం విప్లవ్ దేవ్ గెలిచిన బనమాలిపూర్ నుంచి పోటీ చేయనున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు విప్లవ్ దేవ్ దానిని వదులుకుని ఎంపీ అయినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రి ప్రతిమా భూమిక్ ధన్‌పూర్ నుండి పోటీ చేయబోతున్నారు. ఆమె గతంలో సిపిఐ(ఎం) కు చెందిన మాజీ సిఎం మాణిక్ సర్కార్‌పై పోటీ చేసి ఓడిపోయారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+