బెంగాల్ లో బీజేపీదే విజయం, పోలింగ్ వేళ ప్రశాంత్ కిషోర్ ఆడియో ప్రకంపనలు .. పీకే రియాక్షన్ ఇదే !!
తీవ్ర ఉద్రిక్తతల నడుమ కొనసాగుతున్న పశ్చిమబెంగాల్ నాలుగవ దశ ఎన్నికల పోలింగ్ సమయంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని టార్గెట్ చేస్తూ బిజెపి బాంబు పేల్చింది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల వ్యక్తి ప్రశాంత్ కిషోర్ క్లబ్ హౌస్ చాట్ లో పేర్కొన్న అంశాలకు సంబంధించిన ఆడియోను లీక్ చేసింది.ఇక పీకే ఈ ఆడియోకు కౌంటర్ ఇచ్చారు .

మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఆడియో లీక్
మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పశ్చిమబెంగాల్లో ప్రధాని నరేంద్ర మోడీ కి బాగా పాపులారిటీ పెరిగిందని చెప్పారు. బీజేపీ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన తన చాట్ లో పేర్కొన్నారు. 2021 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి బెంగాల్‌ను గెలుచుకుంటుందని చూపించే టిఎంసి సర్వే గురించి పోల్ స్ట్రాటజిస్ట్ చర్చించినట్లు విలేకరులు నిర్వహించిన బహిరంగ క్లబ్‌హౌస్‌లో ప్రశాంత్ కిషోర్ సంభాషణను బిజెపి ఐటి సెల్ హెడ్ అమిత్ మాల్వియా పంచుకున్నారు.

నాల్గవ దశ ఎన్నికల పోలింగ్ సమయంలో బాంబు పేల్చిన బీజేపీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాల్గవ దశలో రాష్ట్రంలో ఓటర్లు ఓటు వేస్తున్న సమయంలో ఆడియో బాంబును బిజెపి విడుదల చేసింది . పశ్చిమ బెంగాల్లో టిఎంసి ఇప్పుడే అధికారం నుండి బయటకు విసిరి వేయబడుతుంది అంటూ, దీదీ కుర్చీ చేజారి పోతుంది అంటూ బిజెపి నేతలు టార్గెట్ చేస్తున్నారు.
ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలలో రాష్ట్రంలో ఓటు ఉంటే అది మోడీ పేరుతోనే ఉందని, హిందువుల పేరుతోనే ఓట్లు ఉన్నాయని, ప్రధాని నరేంద్ర మోడీ హిందీ సంభాషి అని , ధ్రువణత , ఎస్సీ కావడం బీజేపీ విజయానికి ప్రధాన కారణాలుగా , బిజెపి గెలుస్తుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు .

పీకే ఆడియో సంభాషణలో ఆసక్తికర విషయాలు
తృణమూల్ కాంగ్రెస్ నుంచి సువేందు అధికారి నిష్క్రమించడం, పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మమతా బెనర్జీకి సలహా ఇవ్వడం వంటి అంశాలు ఈ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపవని ప్రశాంత్ కిషోర్ పేర్కొన్నారు. దళితులు , మాథువా వర్గాలు ప్రత్యేకంగా బిజెపికి ఓటు వేయడం చాలా ముఖ్యమైన అంశం అని ప్రశాంత్ కిషోర్ అన్నారు.ఇక ఈ ఆడియో చాట్ లీక్ చేసిన మాలవ్యా .. ఇక తన చాట్ లీక్ అవుతుందని ప్రశాంత్ కిషోర్ కి తెలియదని బిజెపి నేత అమిత్ మాలవ్యా అన్నారు .

దమ్ముంటే మొత్తం ఆడియో బయటపెట్టాలన్న టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త పీకే
బెంగాల్ రాష్ట్రంలో వామపక్షాలు , కాంగ్రెస్, టీఎంసీల పట్ల గత 20 ఏళ్లలో ముస్లింలు వ్యతిరేకంగా ఉన్నారని పేర్కొన్నారు . పాలన పట్ల బెంగాల్ వాసులు కోపంగా ఉన్నారని చాట్ ద్వారా బహిర్గతమైంది అమిత్ మాలవ్య పేర్కొన్నారు.
అయితే లీకైన ఆడియో చాట్ పై పీకే స్పందించారు . దమ్ముంటే మొత్తం ఆడియో బయటపెట్టాలని టీఎంసీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సవాల్ విసిరారు. అది అసలు తన ఆడియో కాదంటూ ట్విట్టర్ ద్వారా ఖండించిన ప్రశాంత్ కిషోర్ తమ పార్టీ నాయకుల మాటల కంటే , తన మాటలను బీజేపీ సీరియస్ గా తీసుకోవడం ఆనందంగా ఉంది అంటూ ఎద్దేవా చేశారు.
Recommended Video

మొత్తం చాటింగ్ బయటపెట్టాలన్న పీకే బీజేపీ 100 సీట్లు దాటదని స్పష్టం
తమకు అనుకూలమైన క్లిప్పింగ్ లకు బదులుగా ధైర్యం ఉంటే మొత్తం చాటింగ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో బీజేపీ 100 సీట్ల మార్కును దాట బోదు అంటూ ప్రశాంత్ కిషోర్ మరోమారు స్పష్టం చేశారు . మొత్తానికి బీజేపీ నేతలు తృణమూల్ గేమ్ ఓవర్ అంటూ సంబరాలు చేసుకుంటుంటే , బిజెపి నేతల డ్రామాలాడుతున్నారని టిఎంసి మండిపడుతుంది. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో నాలుగో దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్న నేడు కిషోర్ కు సంబంధించిన క్లబ్ హౌస్ చాట్ ఆడియో టేపు ప్రకంపనలు బెంగాల్ పోరులో ఆసక్తికరంగా మారాయి.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications