శత్రుఘ్న సిన్హాకు షాకిచ్చిన బీజేపీ: తెరపైకి సుశీల్ మోడీ
పాట్నా: ఓ వైపు భారతీయ జనతా పార్టీ ఎంపీగా కొనసాగుతూనే మరో వైపు ఆ సొంత పార్టీపైనే తరచూ విమర్శలు ఎక్కుపెట్టే శత్రుఘ్న సిన్హాకు ఆ పార్టీ గట్టి షాకిచ్చింది. అతను ప్రాతినిథ్యం వహిస్తున్న పాట్నా సాహిబ్ నియోజకవర్గం నుంచి బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీని బీజేపీ బరిలో దించనుంది.
పార్టీ కీలక నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న శత్రుఘ్న సిన్హాకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టికెట్ నిరాకరించినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 2014 లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్ర కేబినెట్‌లోకి తనను తీసుకోకపోవడంపై గుర్రుగా ఉన్న సిన్హా కొంత కాలంగా ప్రధాని మోడీ, పార్టీకి వ్యతిరేకంగా పలు సందర్భాల్లో గళం విప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల్లో తాను తిరిగి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న శత్రుఘ్న సిన్హాకు సుశీల్ కుమార్ మోడీ తెరపైకి తేవడం ద్వారా చెక్ పెట్టేందుకు బీజేపీ యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. వాజపేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేసిన సిన్హా మరోసారి తన సొంత నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నారు. అయితే, చివరి సమయం వరకు వేచి చూడాల్సిందే.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!











Click it and Unblock the Notifications