వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎంపీలకు ’అభ్యాస్ వర్గ‘.. సమయ పాలన, క్రమశిక్షణపై రెండురోజులు శిక్షణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ సీట్లు సాధించి అధికారం చేపట్టింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించి రెండోసారి అధికారం చేజిక్కుంచుకుంది. కానీ ఆ పార్టీ కొందరు ఎంపీల వైఖరి మాత్రం మారలేదు. అధికారం చేపట్టామన్న పొగరో, ఎంపీలయ్యామనే టెక్కో తెలియడం లేదు కానీ కొందరికీ నోటి దూల ఎక్కువైంది. దీంతో అధికార బీజేపీ చాలాసార్లు ఇరుకున పడిపోయింది. దీంతో తమ ఎంపీలకు మరోసారి అభ్యాస్ వర్గ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి రెండురోజుల పాటు శిక్షణ తరగతులు పెట్టి ఎలా నడుచుకోవాలో శిక్షణ ఇస్తోంది.

బీజేపీ ఎంపీల నోటిదూలతో ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా సాద్వీ ప్రజ్ఞా సింగ్ నోటీ దురుసు కమలదళాన్ని ఊపిరాడయనీయడం లేదు. దీంతో మరికొందరు ఇలాగే ప్రవర్తించే అవకాశం ఉందని హైకమాండ్ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంది. ఢిల్లీలో 'అభ్యాస్ వర్గ' శిక్షణ తరగతులు ఇస్తోంది. ఈ శిక్షణకు ఎంపీలు విధిగా హాజరుకావాలని హైకమాండ్ స్పష్టంచేసింది. డుమ్మాకొట్టిన ఎంపీలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీచేయడంతో ఎంపీలంతా కిమ్మనకుండా తరగతులకు హాజరవుతున్నారు. ఉదయం బీజేపీ కార్యనిర్వహక అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రసంగంతో శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయి. సాయంత్రం బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడతారు. పార్టీ చీఫ్‌ల ప్రసంగాల తర్వాత ఆదివారం ఎంపీలతో ప్రధాని నరేంద్ర మోడీ ఇంటరాక్ట్ అవుతారు.

BJP To Hold Discipline Class For Lawmakers Today. Bunking Not Allowed

అభ్యస్ వర్గలో ప్రధానంగా నేతలు నడవడిక గురించి డిస్కస్ చేస్తారు. క్రమశిక్షణ ఉండాలని, కొందరు తీరు మార్చుకోవాలని దిశానిర్దేశం చేస్తారు. దీంతోపాటు పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావాలని కూడా స్పష్టంచేశారు. దీంతోపాటు తమ పార్టీ సైద్ధాంతిక అంశాలు, వాటిపై పార్టీ వైఖరికి కట్టుబడాలని చెబుతారు. ఇప్పటికే అభ్యరస్ వర్గను హిమాచల్ ప్రదేశ్‌లో నిర్వహించారు. శిక్షణతో యువ ఎంపీలకు మేలు చేసినట్లైందని పేర్కొన్నారు. 2014లో బీజేపీ అధికారంలో వచ్చాక అభ్యాస్ వర్గ పేరుతో శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది.

English summary
A two-day 'orientation programme' for BJP parliamentarians, where attendance is compulsory, starts today at 10 am. The closed-door sessions will focus on conduct, discipline, parliamentary procedures and ideological issues, sources said. Prime Minister Narendra Modi, Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh and BJP working president JP Nadda will lead the programme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X