Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ .. రావణ , కుంభకర్ణులతో పోల్చుకుంటూ విమర్శలు

మహారాష్ట్ర ఎన్నికలకు సమయం ఆసన్నమైన తరుణంలో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది. అధికార బిజెపి, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఇతిహాసాలలోని పాత్రలతో పోల్చుకుంటూ ఒకరు విమర్శనాస్త్రాలు గుప్పించు కుంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ను కాంగ్రెస్ నాయకులు రావడంతో పోలీసులు ఉంటే, భారతీయ జనతా పార్టీ మొత్తం కాంగ్రెస్ నాయకులను రావణుడి సోదరుడు కుంభకర్ణుడుతో పోలుస్తున్నారు.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పిస్తున్న నాయకులు హిందూ ఇతిహాసం రామాయణం లోని పాత్రలతో పోల్చుకుంటూ తిట్టుకుంటున్నారు. రాష్ట్రంలోని రైతుల సమస్య, పాలన సమస్యలు గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నానా పటోల్ మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ను రావణుడితో పోల్చారు. మహారాష్ట్రలో రావణుడి పాలన సాగుతున్నదని ఆయన విమర్శలు గుప్పించారు. అంతే కాదు రావణుడు చాలా అహంకారి అని, అలాంటి అహంకార పాలన బీజేపీ సాగిస్తుంది అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నానా పటోల్ మండిపడ్డారు.

BJP versus Congress in Maharashtra .. Compared with Ravana and Kumbhakarna

ఇక ఈ వ్యాఖ్యలకు కౌంటర్ గా బీజేపీ సైతం విమర్శలు గుప్పిస్తుంది. బిజెపి అధికార ప్రతినిధి మాధవ్ బండారి ప్రధాని నరేంద్ర మోడీ రామరాజ్యము వైపు దేశాన్ని నడిపిస్తున్నారని , కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కుంభకర్ణుడి లా నిద్ర పోతున్నారని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో బిజెపి కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్ధం గట్టిగానే నడుస్తుంది. ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటూ రాజకీయాన్ని వేడెక్కిస్తున్నారు. ఈసారి ఎన్నికలు అటు అధికార బీజేపీకి, ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకం కావటంతో ఇరు పార్టీలు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు.

మహారాష్ట్రలో ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ పొత్తుతో ముందుకు వెళ్లనుంది . ఈ నేపధ్యంలో బీజేపీ టెన్షన్ పడుతుంది. ఇక ఇక్కడ బీజేపీ తీరుపై శివేసేన సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో ఈ ఎన్నికలు బీజేపీకి కత్తి మీద సామే. ఇక ఎన్నికల ముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు షాక్ తగిలింది. మహారాష్ట్ర కోపరేటివ్ బ్యాంక్ కుంభకోణంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. కాంగ్రెస్ తో పొత్తులతో ఎన్నికలకు వెళ్లనున్న నేపధ్యంలో ఈడీ కేసు ఎన్సీపీకి గట్టిదెబ్బగానే చెప్పుకోవాలి. అయితే ఇదంతా బీజేపీనే చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+