షాకింగ్: తమిళనాడులో పుదుచ్చేరి విలీనం -కాంగ్రెస్ ఓట్లు డీఎంకేకు పడవు -మాజీ సీఎం నారాయణస్వామి
పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కాంగ్రెస్-డీఎంకే-లెఫ్ట్-వీసీకే పార్టీల కూటమికి నాయకుడిగా వ్యవహరిస్తోన్న వి. నారాయణస్వామి మరోసారి షాకింగ్ కామెంట్లు చేశారు. బీజేపీ గనుక అధికారంలోకి వస్తే కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి గుర్తింపును లాగేసుకుంటుందని, పొరుగున ఉన్న తమిళనాడులో పుదుచ్చేరిని విలీనం చేసేస్తుందని అన్నారు.
గత నెలలో కొందరు డీఎంకే, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో నాటకీయ పరిణామాల మధ్య నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలడం, ఆ వెంటనే పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీని కేంద్రం వెనక్కి పిలిపించడం, ఈసీ నగరాతో ఎన్నికల హడావుడి మొదలు కావడం తెలిసిందే. ప్రచారం ప్రారంభం నుంచే విలీనం అంశంపై నారాయణ స్వామి వరుస వ్యాఖ్యలు చేస్తున్నారు. పుదుచ్చేరిని లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని ఆరోపిస్తున్నారు. తాజాగా
పలు జాతీయ చానెళ్లతో శుక్రవారం మాట్లాడిన నారాయణస్వామి మరోసారి విలీనం అంశాన్ని ప్రస్తావించారు. ఆ మేరకు బీజేపీ కుట్రలు చేస్తోందని, దాన్ని ఎదురించేందుకు పుదుచ్చేరి జనం సిద్ధంగా ఉన్నారని ఆయన చెప్పారు. కాగా, నారాయణస్వామి చెబుతున్నట్లు పుదుచ్చేరిని తమిళనాడులో విలీనం చేయాలన్న ఆలోచన బీజేపీకి ఇంతైనా లేదని ఆ పార్టీ తమిళనాడు ఎన్నికల ఇంచార్జి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇదివరకే క్లారిటీ ఇచ్చారు. కాగా,

మొత్తం 30 సీట్లున్న పుదుచ్చేరి అసెంబ్లీ ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగనుండగా, ఈసారి కాంగ్రెస్ కేవలం 14 సీట్లలో అభ్యర్థుల్ని ప్రకటించగా, మిత్రపక్షం డీఎంకేకు ఏకంగా 13 సీట్లిచ్చి, సీపీఐ, వీసీకేలకు చెరో సీటిచ్చింది. డీఎంకేకు ఎక్కువ సీట్లు ఇవ్వడంపై కాంగ్రెస్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీనిపైనా నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు..
పుదుచ్చేరిలో కాంగ్రెస్ అధికారంలో కొనసాగి కూడా డీఎంకేకు దాదాపు సమాన సంఖ్యలో సీట్లివ్వడంపై కాంగ్రెస్ కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని మాజీ సీఎం నారాయణస్వామి అంగీకరించారు. ''కాంగ్రెస్ శ్రేణులెవరూ తమ ఓటును డీఎంకే అభ్యర్థులకు వేయాలనుకోవడం లేదు. అయితే పొత్త ధర్మం దృష్యా మాకిది తప్పడంలేదు. డీఎంకేకు సహకరించేలా కాంగ్రెస్ శ్రేణుల్ని ఒప్పించుకుంటాం'' అని మాజీ సీఎం అన్నారు.
-
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
రుణమాఫీ నిధులు విడుదల, వడ్డీ రాయితీపై కీలక ఉత్తర్వులు. -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications