సైకిల్‌కు ఓటేయ్యమని చెప్తావా?.. పోలింగ్ అధికారిపై బీజేపీ కార్యకర్తల దాడి (వీడియో)
మొరాదాబాద్ : లోక్‌సభ మూడో దశ ఎన్నికల సందర్భంగా పలుచోట్ల అవాంఛనీయ ఘటనలు జరిగాయి. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. 231 పోలింగ్ బూత్ లో విధులు నిర్వహిస్తున్న పోలింగ్ అధికారి ఓటర్లను మభ్యపెట్టారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు దాడికి దిగారు.

బూత్ లోనికి వచ్చే ఓటర్లను సైకిల్ గుర్తు (సమాజ్‌వాదీ పార్టీ) కు ఓటేయాల్సిందిగా సదరు పోల్ ఆఫీసర్ కోరినట్లు బీజేపీశ్రేణులకు సమాచారం అందడంతో పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. ఆయనపై దాడి చేసి పోలింగ్ బూత్ నుంచి బయటకు తీసుకొచ్చి చితక్కొట్టారు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఆ పోలింగ్ అధికారిని వేరేచోటకు తరలించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అనంతరం ఉన్నతాధికారులకు బీజేపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు.
#WATCH Moradabad: BJP workers beat an Election Official at booth number 231 alleging he was asking voters to press the 'cycle' symbol of Samajwadi party pic.twitter.com/FokdXCAJ1z
— ANI UP (@ANINewsUP) April 23, 2019












Click it and Unblock the Notifications