వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

43 లక్షల మంది ఇళ్లకు బీజేపీ కార్యకర్తలు.. హస్తిన పురవీధుల్లో.. ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

అయోధ్యలో రామాలయ నిర్మాణం జరుగుతోంది. అందుకు విరాళాల సేకరణ కార్యక్రమం కూడా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం రోజున రామ జన్మభూమి మందిర నిర్మాణం కోసం నిధుల సేకరణ కార్యక్రమానికి నడుం బిగించింది. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు అదేశ్ గుప్తా కార్యక్రమాన్ని పర్యేవేక్షిసోండగా.. కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ ముఖ్య అతిథిగా పాల్గొనే అవకాశం ఉంది. రామ మందిర నిర్మాణం కోసం ఇష్టపూర్వకంగా నిధులు ఇచ్చినవారిని సన్మానిస్తారు.

BJP workers to visit 43 lakh homes in Delhi..

ఆదివారం బీజేపీ కార్యకర్తలు 43 లక్షల మంది ఇళ్లకు వెళతారని జనరల్ సెక్రటరీ కుల్జీత్ సింగ్ చహల్ పేర్కొన్నారు. రిక్షవాలా, కూరగాయాలు విక్రయించే వ్యక్తి, ప్రజలు.. ప్రతీ ఒక్కరీ వద్ద నుంచి విరాళాలు సేకరిస్తారు. విరాళాల సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

అయోధ్యలో రామాలయ నిర్మాణం ప్రతీ ఒక్క భారతీయుడి కల అని చెబుతున్నారు. ఆలయ నిర్మాణం కోసం ఎన్నో అటు పోట్లను ఎదుర్కొవాల్సి వచ్చింది. తమ స్థాయికి తగ్గట్టు ప్రతీ ఒక్కరు సాయం చేస్తున్నారు. రామసేతు నిర్మాణానికి ఉడత సాయం చేసినట్టు.. రామాలయ నిర్మాణం కోసం ప్రతీ ఒక్కరు సాయం చేయాలని కోరారు.

English summary
event will be organised in Delhi at the BJP party office on Sunday to honour those who make donations for the Ram Janmabhoomi Mandir Nidhi Samarpan Campaign.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X