Rajasthan Polls: రాజస్తాన్ లో బీజేపీ పక్కా సోషల్ ఇంజనీరింగ్ - కాంగ్రెస్ ను కులాలతో కొట్టే వ్యూహం..
ఐదేళ్లకోసారి ప్రభుత్వాల్ని మార్చే సంప్రదాయం ఉన్న రాజస్తాన్ లో ఈ నెలలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీలకు చావోరేవో మారిపోయాయి. దీనికి ప్రధాన కారణం వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలే. ఇప్పుడు గెలువకపోతే ఆ ప్రభావం ఎక్కడ సార్వత్రిక ఎన్నికలపై పడుతుందో అన్న భయం కాంగ్రెస్, బీజేపీల్ని వేధిస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన కుల సమీకరణాలపై బీజేపీ దృష్టిసారిస్తోంది.
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సామాజిక న్యాయం, వెనుకబడిన కులాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని పిలుపునిస్తూ మండల రాజకీయాలతో బిజెపి హిందూత్వ రాజకీయాల్ని ఎదుర్కోవడానికి బీజేపీయేతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అలాగే కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కూడా కులాల సర్వేను ప్రకటించారు. దీంతో బీజేపీ ఇప్పుడు వీటిని కౌంటర్ చేసేందుకు పార్టీ సంప్రదాయ ఓటు బ్యాంకు అయిన రాజ్ పుత్ లు, బ్రాహ్మణులు, బనియాల్ని తిరిగి నమ్ముకుంటోంది. అదే సమయంలో వెనుక బడిన వర్గాల్ని ఆకర్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఈసారి బీజేపీ ఏకంగా 60 మంది ఓబీసీ అభ్యర్ధులకు అవకాశం ఇచ్చింది. అంటే దాదాపు 30 శాతం మందికి ఛాన్స్ ఇచ్చారు. అలాగే రాజస్థాన్‌లో అత్యంత ఆధిపత్య ఓబీసీ వర్గంగా ఉన్న జాట్ సామాజికవర్గానికి చెందిన బీజేపీ నేతలకు 31 టిక్కెట్లు లభించాయి. ఇతర చిన్న ఓబీసీ గ్రూపులైన యాదవ్, కుమావత్, బిష్ణోయ్, సైనీ, పటేల్, నగర్, రావణ రాజ్‌పుత్, ధకడ్‌లకు 29 టిక్కెట్లు లభించాయి. అలాగే ఎంబీసీ కేటగిరీలో అత్యధిక ప్రాబల్యం ఉన్న గుజ్జర్ వర్గానికి 10 టిక్కెట్లు ఇచ్చారు. దీతో ఈసారి బీసీ వర్గాలకు బీజేపీ 70 సీట్లు అంటే 35 శాతం ఇచ్చినట్లయింది.
అలాగే 35 మంది ఎస్సీలకు ఈసారి టికెట్లు ఇచ్చింది. ఇందులో 34 రిజర్వుడు సీట్లు కాగా.. ఓ అభ్యర్ధికి జనరల్ సీటులోనూ అవకాశం ఇచ్చింది. దీంతో బిజెపి అభ్యర్థుల జాబితాలో ఎస్సీ వర్గానికి చెందిన అభ్యర్థులు 17.5 శాతం ఉన్నారు. అలాగే 29 మంది ఎస్టీ అభ్యర్ధులకు సీట్లు ఇచ్చింది. వీరిలో నలుగురు అన్‌రిజర్వ్‌డ్ స్థానాల నుండి, మిగిలినవారు రిజర్వుడు సీట్ల నుంచి పోటీ చేస్తున్నారు.
దీంతో బీజేపీ మొత్తం అభ్యర్ధుల్లో ఎస్టీలకు 14.5 శాతం సీట్లు ఇచ్చినట్లయింది. అలాగే అగ్రవర్ణాల్లో 27 మంది రాజ్‌పుత్ అభ్యర్థులకు, 19 మంది బ్రాహ్మణులకు టికెట్లు ఇచ్చింది. వ్యాపారులు, ఇతర వర్గాల నుండి 17 మంది అభ్యర్థులను పోటీలో నిలిపింది. ఇందులో జైన్, సింధీ, రాజ్‌పురోహిత్, పంజాబీ వంటి వారు ఉన్నారు. దీంతో మొత్తం 200 మంది అభ్యర్ధుల్లో 63 మంది అగ్రవర్ణాలకు టికెట్లు ఇచ్చినట్లయింది. దీంతో వీరి శాతం 31.5 శాతంగా ఉంది. అయితే ముస్లింలకు మాత్రం ఒక్క టికెట్ కూడా ఇవ్వలేదు.
-
మనదేశంలో భూతల స్వర్గాన్ని తలపించే బెస్ట్ టూరిస్టు స్పాట్స్ ఇవే.. -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..!












Click it and Unblock the Notifications