Black fungus మెడిసిన్ కొరత-రిస్క్‌లో 30 మంది సైనికుల ప్రాణాలు-ఆందోళన వ్యక్తం చేస్తున్న వైద్యులు

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిచ్చే అంశమే అయినా... అదే సమయంలో బ్లాక్ ఫంగస్(మ్యుకొర్‌మైకోసిస్) కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. దానికి తోడు బ్లాక్ ఫంగస్ చికిత్సకు ఉపయోగించే మందుల కొరత సమస్యను మరింత జటిలం చేస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలోని రెండు ఆర్మీ ఆస్పత్రుల్లో 30 మంది సైనికులు బ్లాక్ ఫంగస్‌కు చికిత్స పొందుతున్నారు. అయితే బ్లాక్ ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే అంఫోటెరిసిన్-బి కొరత కారణంగా.. తమ వద్ద చికిత్స పొందుతున్న సైనికుల ప్రాణాలు రిస్క్‌లో పడేలా ఉన్నాయని అక్కడి వైద్యులు వాపోతున్నారు.

'ఓవైపు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుంటే... దాని చికిత్సకు అవసరమయ్యే కనీస మందుల కోసం మేము ఎదురుచూస్తున్నాం. దీంతో ఫ్రంట్ లైన్ సైనికులతో పాటు చాలామంది ప్రాణాలు రిస్క్‌లో ఉన్నాయి.' అని రీసెర్చ్&రిఫరల్ ఆర్మీ ఆస్పత్రి వైద్యుడు ఒకరు వెల్లడించారు. రీసెర్చ్&రిఫరల్ ఆర్మీ ఆస్పత్రితో పాటు మరో ఆర్మీ ఆస్పత్రిలో ప్రస్తుతం అవసరమైన దాని కంటే సగం కన్నా తక్కువ మెడిసిన్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Black fungus eruption hits soldiers at Delhis Army hospitals, struggle on for drugs

మరోవైపు, అంఫోటెరిసిన్ బి మెడిసిన్ కొరత గురించి ప్రభుత్వానికి తెలియజేశామని... ప్రభుత్వం దాన్ని ప్రియారిటీగా తీసుకుని చర్యలు మొదలుపెట్టిందని రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.

రెండు రోజుల క్రితం ఢిల్లీ హైకోర్టు బ్లాక్ ఫంగస్ మెడిసిన్‌పై కేంద్రానికి పలు ఆదేశాలిచ్చింది. అంఫోటెరిసిన్ బితో పాటు లైపోసొమల్ మెడిసిన్ పంపిణీకి సంబంధించి పాలసీని రూపొందించాలని ఆదేశించింది. ఇప్పటికే చాలా ఏళ్లు బతికిన వృద్దుల కంటే యువతకు,బతికే అవకాశం ఎక్కువగా ఉన్నవారికి ఈ మెడిసిన్ విషయంలో ప్రాధాన్యతనివ్వాలని కోరింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు సంబంధించి మెడిసిన్ కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రం చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు విరుద్దంగా ఉంది. సకాలంలో రాష్ట్రాలకు అంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్లు రాకపోతుండటంతో వైద్యులు కూడా చేతులెత్తేస్తున్న పరిస్థితి. అటు ప్రతిపక్షాలు కూడా దీనిపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.

ప్రస్తుతం బ్లాక్ ఫంగస్‌ వ్యాప్తికి సంబంధించి పరిశోధనలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో ... కరోనా చికిత్సలో అధిక మోతాదులో స్టెరాయిడ్స్ ఇవ్వడం లేదా అన్‌శాటైజ్డ్ ఆక్సిజన్ ఎక్విప్‌మెంట్‌ను ఉపయోగించడం బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కారణంగా చెబుతున్నారు.వ్యాధి సోకినవారిలో కళ్లు, ముక్కుచుట్టూ ఎర్రగా అవ్వడం లేదా నొప్పి రావడం, జ్వరం, తలనొప్పి, దగ్గు, ఊపిరి సరిగా ఆడకపోవడం, రక్తపు వాంతులు,ముఖం వాపు రావడం బ్లాక్ ఫంగస్ లక్షణాలు. కొన్నిసార్లు కంటి చుట్టూ కండరం బిగుసుకుపోయి వాపు రావొచ్చు. వైరస్ ఒకవేళ ముక్కు నుంచి మెదడుకు చేరితే మరణం సంభవిస్తుంది. దేశంలో మొదట గుజరాత్,ఢిల్లీలో బయటపడ్డ బ్లాక్ ఫంగస్ కేసులు గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో బయటపడ్డాయి. దీంతో ఆయా రాష్ట్రాలు కోవిడ్‌తో పాటు బ్లాక్ ఫంగస్ పట్ల ఇప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+