చిన్నారులకు బ్లాక్ ఫంగస్ .. ముంబైలో ముగ్గురు చిన్నారులకు ఒక్కో కన్ను తొలగింపు
ముంబైలో బ్లాక్ ఫంగస్ సోకిన ముగ్గురు చిన్నారులకు శస్త్ర చికిత్స నిర్వహించి వారికి ఒక్కొక్క కన్ను తొలగించారు వైద్యులు. పిల్లలలో మ్యూకోర్ మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ కేసులు ఆందోళన కలిగించే సంకేతం అని వైద్యులు అంటున్నారు. ఈ ఇన్ఫెక్షన్ కరోనా రోగులను, డయాబెటిస్ రోగులను లక్ష్యంగా చేసుకుంటుందని, కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత కూడా ఇది అత్యంత ప్రమాదకరంగా పరిణమిస్తోందని చెప్తున్నారు.

ముగ్గురు చిన్నారులకు ఒక్కో కన్ను తొలగించిన వైద్యులు
ముంబైలోని రెండు ఆసుపత్రులలో 4, 6 మరియు 14 సంవత్సరాల వయస్సు గల ముగ్గురు పిల్లలకు ఆపరేషన్ చేశారు. మొదటి ఇద్దరు పిల్లలకు డయాబెటిస్ లేదు, కానీ 14 ఏళ్ల పిల్లవాడు డయాబెటిక్ . మరొక 16 ఏళ్ల పిల్లవాడు కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత డయాబెటిక్ అయ్యాడు . అతని కడుపులో కొంత భాగం బ్లాక్ ఫంగస్ బారిన పడినట్లు వైద్యులు తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ లో బ్లాక్ ఫంగస్ బారిన పడిన ఇద్దరు బాలికలను మేము చూశామని ఫోర్టీస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ జెసాల్ షెత్ చెప్పారు.

డయాబెటిస్,కరోనా బ్లాక్ ఫంగస్ కు కారణం అంటున్న వైద్యులు
తమ దగ్గరకు వచ్చిన ఇద్దరూ డయాబెటిక్ అని తెలిపారు. ఆమె మా వద్దకు వచ్చిన తరువాత ఆమె కళ్ళలో ఒకటి 48 గంటల్లో నల్లగా మారింది. ఇక ముక్కు ద్వారా కూడా ఫంగస్ వ్యాప్తి చెందుతుందని గుర్తించి , అది మెదడుకు చేరకపోవడంతో ఆరు వారాలు చికిత్స అందించామని అయినప్పటికీ దురదృష్టవశాత్తు, ఆమె కన్ను కోల్పోయింది అని ఆయన పేర్కొన్నారు. మరో కేసులో16 ఏళ్ల పిల్లవాడు ఒక నెల క్రితం ఆరోగ్యంగా ఉన్నాడు. అతను కోవిడ్ నుండి కోలుకున్నాడు. అతను కూడా డయాబెటిక్ కాదు. కానీ అతను కరోనా తగ్గడానికి వాడిన మెడిసిన్స్ వల్ల అకస్మాత్తుగా డయాబెటిస్ బారిన పడ్డారు.

డయాబెటిస్ లేని వారికి కూడా బ్లాక్ ఫంగస్ .. వారికి వైద్యం
అతని ప్రేగుల్లో రక్తస్రావం ప్రారంభమైందని గుర్తించి మేము యాంజియోగ్రామ్ చేసామని, బ్లాక్ ఫంగస్ సోకినట్లు కనుగొన్నామని పేర్కొన్నారు. మధుమేహం లేని చిన్న పిల్లలను ముంబైలోని కెబిహెచ్ బచూలి ఆప్తాల్మిక్ మరియు ఇఎన్టి ఆసుపత్రిలో చేర్చారు. వారి కళ్ళలో బ్లాక్ ఫంగస్ వ్యాపించిందని , కళ్ళను తొలగించకపోతే వారి ప్రాణానికి ప్రమాదం ఉండేదని వైద్యులు పేర్కొన్నారు. వారు అప్పటికే ఒక కంటి చూపు కోల్పోయారు, అది వారిని తీవ్రంగా బాధించింది. గత ఏడాది డిసెంబర్‌లో ఒక పిల్లవాడు మా వద్దకు వచ్చాడు.

బ్లాక్ ఫంగస్ ను ముందే గుర్తించాలి .. లేదంటే ప్రమాదమే
రెండవ కేసు కరోనా సెకండ్ వేవ్ లో వచ్చింది "అని ఆసుపత్రిలో ఓక్యులోప్లాస్టీ, ఓక్యులర్ ఆంకాలజీ మరియు ఓక్యులర్ ప్రొస్థెటిక్ డాక్టర్ ప్రితేష్ శెట్టి చెప్పారు.బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్ దూకుడుగా ఉన్నందున ముందుగానే గుర్తించాలని లేదంటే మెదడుకు సోకే ప్రమాదముందని, ఒక్కోసారి కళ్లను తీసివేయడంతో పాటుగా, దవడలను కూడా తొలగించాల్సి వస్తుంది అని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ప్రజలకు కరోనా భయంతో పాటుగా ఫంగస్ భయం కూడా పట్టుకుంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications