నటి రాధిక కుమారస్వామి ఇంట్లో దొంగతనానికి ప్లాన్‌చేసి
బెంగళూరు: కర్నాటక పోలీసులు రెండు రోజుల క్రితం ఏడుగురు పెప్పర్ రాబర్స్‌ను అరెస్టు చేశారు. వారు జూన్ 21న హాందేలు ప్రాంతంలోను ఓ గోడౌన్ నుండి రూ.8.5 లక్షల పెప్పర్‌ను దొంగిలించారు. అయితే, విచారణలో వారు రాధికా కుమారస్వామి ఇంట్లో దొంగతనానికి ప్లాన్ చేసినట్లుగా తేలింది.
బంత్వాల్‌లోని సాలెత్తూర్‌లో గల ప్రముఖ కన్నడ నటి, రాధికా కుమారస్వామి ఇంట్లో దొంగతనం చేయాలని వారు పథకం రచించారట. రాధికా కుమారస్వామి కుటుంబ సభ్యులతో అక్కడి ఇంట్లో ఉంటోంది. అయితే, ఆ ప్రణాళిక అమలుకు ముందే పోలీసులు వారిని అరెస్టు చేశారు.

పోలీసులు నిందితులను ఏడుగురుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. వారి నుండి ఒక మహింద్రా స్కార్పియో, సుమో గ్రాండ్ వెహికిల్, రెండు పొడవైన కత్తులు, నాలుగు చాకులు, రెండు ఇనుప కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మూదబిద్రి పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications