ఫేస్‌బుక్‌లో దూషణ: పాక్‌లోముగ్గురు మహిళల హత్య

పోలీసుల కథనం ప్రకారం.. అహ్మాదీ వర్గానికి చెందిన ముస్లింలు దూషణలతో కూడిన కాబా(సౌదీ అరేబియాలోని మక్కాలోని గ్రాండ్ మసీదులో క్యూబ్ ఆకారంలో ఉన్న నిర్మాణం) ఫొటోను ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారని వార్తలు వెలువడటంతో ఆదివారం సాయంత్రం నుంచి అల్లర్లు చోటు చేసుకున్నాయి.
వారు అప్‌లోడ్ చేసిన ఫొటో న్యూడిటీని కలిగి ఉన్నట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు. కాగా, చెలరేగిన అల్లర్లలో ఆ వర్గానికి చెందిన ఇద్దరు చిన్నారులతోపాటు ఓ మహిళలు గాయపడి మృతి చెందారని తెలిపారు.
అల్లర్లలో మరో మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు చెప్పారు. అల్లర్లను నియంత్రణలోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. పాకిస్థాన్‌లో ఉన్న క్రిస్టియన్, హిందూ, సిక్కు, అహ్మాదీ వర్గానికి చెందిన ముస్లింలను చాలా కాలం నుంచి ఇస్లాం తీవ్రవాదులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.












Click it and Unblock the Notifications