కొచ్చి షిప్ యార్డ్ లో పేలుడు: ఐదు మంది మృతి, ఓఎన్ జీసీ షిప్ లో, ఏం జరిగింది!

Posted By:
Subscribe to Oneindia Telugu

కొచ్చి: కేరళలోని కొచ్చి షిప్ యార్డ్ లో మంగళవారం భారీ పేలుడు సంభవించి ఐదు మంది మరణించారు. 11 మందికి తీవ్రగాయాలు కావడంతో వెంటనే బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స చేయిస్తున్నారు.

Blast on under maitenance ONGC ship at Cochin Shipyard kills 5 in Kerala

మంగళవారం మద్యాహ్నం కొచ్చి షిప్ యార్డ్ లోని ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్ జీసీ)కి చెందిన సాగర్ భూషణ్ షిప్ లో పేలుడు సంభవించింది. విషయం తెలుసుకున్న బాంబు నిర్వీర్యదళం, ఫోరెన్సిక్ నిపుణులు, పోలీసులు సంఘటనా స్థలానికి పరుగు తీశారు.

Blast on under maitenance ONGC ship at Cochin Shipyard kills 5 in Kerala
Blast on under maitenance ONGC ship at Cochin Shipyard kills 5 in Kerala

షిప్ లో మరమత్తులు చేసే వాటర్ ట్యాంక్ దగ్గర పేలుడు సంభవించిందని అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది. పేలుడుకు కచ్చితమైన సమాచారం తెలియడం లేదని, విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. షిప్ లకు మరమత్తులు చెయ్యడానికి కొచ్చి షిప్ యార్డ్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. ముందుజాగ్రత్త చర్యగా కొచ్చి షిప్ యార్డ్ ను తాత్కాలికంగా మూసివేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
At least five people have reportedly been killed and 11 others injured in a blast at Cochin Shipyard in Kerala on Tuesday.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి