మాతా త్రిపుర సుందరి, ప్రజల ఆశీస్సులతో బీజేపీ గెలుపు: రామ్ మాధవ్
న్యూఢిల్లీ: త్రిపుర, నాగాలాండ్‌లలో గెలుపుపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ శనివారం స్పందించారు. మాతా త్రిపుర సుందరి ఆశీర్వాదంతో బీజేపీ గెలిచిందన్నారు.
త్రిపురలో బీజేపీ కృషి వెనుక ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఎంతో ఉందని చెప్పారు. త్రిపుర ప్రజలు మార్పును కోరుకున్నారని తెలిపారు. మొత్తం ఫలితాలు వచ్చే వరకు వేచి చూస్తామని చెప్పారు.
In Meghalaya a divided result is a possibility, we will see that a non-Congress Govt is formed there. Himanta Biswa Sarma ji is leaving for Meghalaya shortly: Ram Madhav,BJP pic.twitter.com/3f3KrBURWb
— ANI (@ANI) March 3, 2018
ఇవి విప్లవాత్మక ఫలితాలు అని అన్నారు. మాతా త్రిపుర సుందరి అమ్మవారు, ప్రజల ఆశీర్వాదం బీజేపీకి ఉందన్నారు. మేఘాలయలో కాంగ్రెస్ పార్టీ కాకుండా మిత్ర పక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications