బాలికపై గ్యాంగ్ రేప్, బండరాళ్లతో కొట్టి హత్య
జంషెడ్‌పూర్: జార్ఖండ్ రాష్ట్రంలోని పశ్చిమ సింగ్‌భూమ్ జిల్ాలలో నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను చంపేశారు. గురువారం సాయంత్రం పాఠశాలకు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత ఇంటి సమీపంలోని వీధి పంపు వద్ద దుస్తులు ఉతుక్కోవడానికి వెళ్లినప్పుడు బాలిక అదృశ్యమైంది.
కుటుబ సభ్యులు ఎంతగా వెతికినా ఆమె జాడ కనిపించలేదు. బెహడా గ్రామ సమీపంలోని పొదల్లో రెండు రోజుల తర్వాత ఆమె నగ్న మృతదేహం కనిపించింది. ఆమె సోదరుడు అక్కడ గాలిస్తుండగా బకెట్‌లో ఉన్న దుస్తులు, చెప్పులు కనిపించాయి.

దాంతో ఆమె కోసం అక్కడే వెతగ్గా బండరాళ్లతో కొట్టేసిన ఆమె మృతదేహం పొదల్లో కనిపించింది. ఆమె ముఖం మీద రాయితో కొట్టిన గుర్తులు ఉన్నాయని పోలీసులు చెప్పారు. ఆమెపై అత్యాచారం చేసి హతమార్చినట్లు ప్రాథమిక ఆధారాలను బట్టి తెలుస్తోంది.
అయితే, ఆ ఘటనలో ఎంత మంది పాల్గొన్నారనేది దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాలిక సెయింట్ పాల్స్ స్కూల్లో చదువుతూ తన మామ వద్ద ఉంటోంది.












Click it and Unblock the Notifications