స్టార్ హీరో, ఎంఎస్ ధోనీ ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య: నివ్వెరపోయిన బాలీవుడ్
ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో, ఎంఎస్ ధోని ఫేమ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్నారు. ముంబై బాంద్రాలోని తన ఫ్లాట్‌లో ఆయన ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఇంకా తెలియ రావాల్సి ఉంది. ఆదివారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
తన ఫ్లాట్‌లో ఉరి వేసుకున్న స్థితిలో నిర్జీవంగా కనిపించారు సుశాంత్ సింగ్. భౌతికకాయాన్ని తొలుత ఆయన ఇంటి పనిమనిషి చూశారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీ బయోపిక్‌లో టైటిల్ క్యారెక్టర్‌లో నటించిన సుశాంత్ సింగ్ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. కేరీర్ అత్యున్నత స్థితిలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆయన ఆత్మహత్య చేసుకోవడం పట్ల దేశ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
Recommended Video
ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. బిహార్‌కు చెందిన సుశాంత్ సింగ్.. ఇప్పటిదాకా 12 సినిమాల్లో నటించారు. ఎంఎస్ ధోనీ తరువాత ఆయన నటించిన అన్ని సినిమాలూ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షాన్ని కురిపించాయి. ఆయనకు స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టాయి.












Click it and Unblock the Notifications