శ్రీదేవి రిపోర్టులో సంచలన విషయాలు: బాడీలో అల్కాహాల్, ఎలా మృతి చెందిందంటే?
దుబాయ్/న్యూఢిల్లీ: నటి శ్రీదేవి మృతికి చెందిన ఫోరెన్సిక్ రిపోర్టులో ఆసక్తికర విషయాలు ఉన్నాయి. దుబాయ్ పోలీసులు శ్రీదేవి మృతి రిపోర్టును విడుదల చేశారు. దీనిని ఆమె బంధువులు, ఇండియన్ కాన్సులేట్ అధికారులకు ఇచ్చారు.
Recommended Video

తొలుత ఈ కవర్‌ను (రిపోర్ట్ కవర్)ను తెరవలేదు. బుర్ దుబాయ్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ రిపోర్టును ఇద్దరు అధికారులు పోలీస్ స్టేషన్లో ఇచ్చారు. దుబాయ్ పోలీసులు ఓపెన్ చేసిన తర్వాత ఈ రిపోర్ట్‌లో ఏముందో కుటుంబ సభ్యులకు, ఇండియన్ కాన్సులేట్ అధికారులకు తెలుస్తుంది.

శ్రీదేవి డెత్ రిపోర్ట్
శ్రీదేవి బోనీ కపూర్ అయ్యప్పన్ పేరుతో దుబాయ్ వైద్యులు నటి ఫోరెన్సిక్ నివేదికను విడుదల చేశారు. పేరు.. శ్రీదేవి బోనీ కపూర్ అయ్యప్పన్, జెండర్.. ఫీమేల్, జాతీయత.. ఇండియన్, పాస్‌పోర్టు.. మృతి చెందిన తేదీ.. ఇలా అన్ని వివరాలతో నివేదికను విడుదల చేశారు.

ప్రమాదవశాత్తూ మృతి
శ్రీదేవి మృతిని దుబాయ్ వైద్యులు ప్రమాదకరంగా నిర్ధారించారు. ఈ మేరకు వైద్యులు ఫోరెన్సిక్ నివేదికలో పేర్కొన్నారు. శ్రీదేవి శనివారం అర్ధరాత్రి దుబాయ్‌లోని హోటల్లో కన్నుమూసిన విషయం తెలిసిందే.

అలా బాత్ టబ్‌లో పడింది
శ్రీదేవి మృతి ప్రమాదకరంగా చనిపోయిందని, హోటల్ గదిలో ఆమె బాత్రూంకు వెళ్లినప్పుడు మృతి చెందినట్లు పేర్కొన్నారు. ఆమెకు గుండెపోటు వచ్చి బాత్ టబ్‌లో పడిపోయినట్లుగా తొలుత వార్తలు వచ్చాయి. కానీ వైద్యులు మత్తులో పడి ఉంటారు. అందుకే వైద్యులు ప్రమాదకరమని చెబుతూ, గుండెపోటు కారణాన్ని పేర్కొనలేదు.

శ్రీదేవి శరీరంలో అల్కాహాల్
శ్రీదేవి శరీరంలో వైద్యులు అల్కాహాల్ కూడా గుర్తించారు. ఆమె మృతిలో ఎలాంటి నేరపూరిత కుట్ర లేదని వెల్లడించారు. దీనిని యూఏఈ ఆరోగ్య శాఖ కూడా వెల్లడించింది. ఆమె మృతి వెనుక కుట్ర లేదని పేర్కొన్నారు. చనిపోవడానికి ముందు ఆమె మద్యం సేవించిందని గుర్తించిన నేపథ్యంలో ఆ మత్తులో ఆమె బాత్ టబ్ పైన పడి కూడా మృతి చెందినట్లుగా భావిస్తున్నారు.

దుబాయ్ పోలీసులు ఇలా
అంతకుముందు, దుబాయ్ పోలీసులు మాట్లాడుతూ.. శ్రీదేవి మరణం వెనుక ఎలాంటి కుట్ర లేదని వెల్లడించారు. ఆమె గుండెపోటుతో చనిపోయిందని చెప్పారు. శ్రీదేవి అంత్యక్రియలు మంగళవారం జరగనున్నాయి. సోమవారం రాత్రి పది గంటల తర్వాత శ్రీదేవి భౌతికకాయం ముంబైకి చేరే అవకాశముంది.

బయటకు వెళ్లి వద్దామనుకున్నారు కానీ
స్థానికంగా (దుబాయ్) వచ్చిన మీడియా ప్రకారం బోనీ కపూర్ శనివారం సాయంత్రం 5.30 గంటలకు శ్రీదేవి బస చేసిన హోటల్ చేరుకుని ఆమెకు సర్ ప్రైజ్ డిన్నర్ ఇద్దామనుకున్నారు. ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. శ్రీదేవి ప్రెషప్ కావడానికి బాత్రూం వెళ్లారు. బాత్రూంకు వెళ్లి చాలాసేపు అయినా తిరిగి రాకపోయేసరికి బోనీకపూర్ వెళ్లి చూడటంతో ఆమె బాత్ టబ్‌లో పడ్డారు.












Click it and Unblock the Notifications