Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బాలీవుడ్ డ్రగ్స్ కేసు .. నేడు ఎన్సీబీ ముందుకు రకుల్..దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ కూడా

బాలీవుడ్ డ్రగ్స్ కేసు అటు బాలీవుడ్ నే కాకుండా, ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ వేగవంతం చేసింది. ఈ క్రమంలో ఈరోజు బాలీవుడ్ డ్రగ్స్ సంబంధాలపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రశ్నించనున్నట్లుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వెల్లడించింది. రియా చక్రవర్తితో రకుల్ ప్రీత్ సింగ్ కు ఉన్న సంబంధాలను , రియా చక్రవర్తి వాట్సాప్ చాట్ ద్వారా గుర్తించిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఈ కేసులో నేడు రకుల్ ప్రీత్ సింగ్ ను విచారించనున్నారు.

సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ

సుశాంత్ మరణం తర్వాత డ్రగ్స్ వ్యవహారంలో ఎన్సీబీ విచారణ

సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణం తర్వాత బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారం తెర మీదకు వచ్చింది. రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్ కోణంపై దర్యాప్తు చేపట్టారు.ఇప్పటికే పలువురు బాలీవుడ్ ప్రముఖులను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల సుశాంత్ సింగ్ రాజ్ పూత్ వద్ద టాలెంట్ మేనేజర్ గా పనిచేసిన జయ సాహాను మూడు రోజుల పాటు విచారించిన విషయం తెలిసిందే. ఇక జయసాహా వద్ద కూడా పలువురు బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ఈ డ్రగ్స్ వ్యవహారంలో గుర్తించిన నార్కోటిక్స్ అధికారులు విచారణకు వారందరికీ సమన్లు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఎన్సీబీ విచారణకు సమన్లు అందుకున్న సెలబ్రిటీలు .. నేడు రకుల్ ఎన్సీబీ ముందుకు

ఎన్సీబీ విచారణకు సమన్లు అందుకున్న సెలబ్రిటీలు .. నేడు రకుల్ ఎన్సీబీ ముందుకు

అందులో భాగంగా బుధవారం రోజు దీపికా పదుకొనే, శ్రద్ధ కపూర్,సారా అలీ ఖాన్ ,రకుల్ ప్రీత్ సింగ్ లకు సమన్లు పంపింది. మొదట సమన్లు అందలేదని చెప్పిన రకుల్ ప్రీత్ సింగ్, తాజాగా సమన్లు అందాయి అంటూ ధ్రువీకరించినట్లుగా తెలుస్తుంది. దీంతో శుక్రవారం రోజు రకుల్ ప్రీత్ సింగ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎదుట విచారణకు హాజరు కానున్నారు. శనివారం జరిగే ఎన్సీబీ విచారణలో పాల్గొనేందుకు దీపికా పదుకొనే ఇప్పటికే ముంబై కి చేరుకున్నారు. అంతేకాదు దీపికా పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్ శుక్రవారం రోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ముందు విచారణలో పాల్గొననున్నారు.

 రేపు దీపికా , సారా ఆలీఖాన్ , శ్రద్దా కపూర్ ల విచారణ

రేపు దీపికా , సారా ఆలీఖాన్ , శ్రద్దా కపూర్ ల విచారణ

ఎన్సీబీ నోటీసులు అందుకున్న మరో నటి సారాఅలీఖాన్ గోవా నుంచి ముంబైకి చేరుకున్నారు. శ్రద్ధ కపూర్,దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ లు శనివారం రోజు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారణలో పాల్గొననున్నారు. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి విచారణలో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీ ఖాన్ ల పేర్లను ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ కేసులోగురువారం రోజు కూడా విచారణ కొనసాగింది. ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టాతో పాటు, సుశాంత్ మాజీ మేనేజర్ శృతి మోదీ ముంబైలోని ఎన్సీబీ గెస్ట్ హౌస్ లో విచారణకు హాజరయ్యారు.వారి స్టేట్మెంట్లను ఎన్సీబీ అధికారులు రికార్డు చేసినట్లుగా తెలుస్తోంది.

Recommended Video

    Rakul Preet Singh కు NCB ఎదురుదెబ్బ, Tollywood Top హీరోయిన్ విచారణలో ఎవరి పేర్లు బయటపెడుతుందో??
    బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవవహారం

    బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవవహారం

    బాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంతో సంబంధమున్న ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్న నేపథ్యంలో వారి విచారణలో ఎవరి పేర్లు వెల్లడిస్తారో అన్న ఆందోళన బాలీవుడ్ సినీ పరిశ్రమలో ప్రస్తుతం కనిపిస్తుంది. బాలీవుడ్లో 80 శాతం మంది డ్రగ్స్ వాడుతున్నారు అని రియా చక్రవర్తి చెప్పిన విషయాలను బట్టి అసలు ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఎంత మంది ప్రముఖులు ఉన్నారు? ఎంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు? వీరందరికీ డ్రగ్స్ ఎక్కడినుండి సరఫరా అవుతుంది? అసలు బాలీవుడ్ లో ఏం జరుగుతుంది ?అన్న కోణంలో ఎన్సీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు రోజుల్లో దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్ , శ్రద్ధ కపూర్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి సెలబ్రిటీలను విచారిస్తున్న నేపథ్యంలో మరెన్ని కొత్త విషయాలు బయటకు వస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+