గురుదాస్ పూర్ లో బాంబు కలకలం
గురుదాస్ పూర్: పంజాబ్ లోని గురుదాస్ పూర్ జిల్లా ప్రజలు ఉగ్రవాదులు జరిపిన దాడుల నుండి కోలుకోక ముందే మళ్లి బాంబు కలకలం రేగింది. విషయం తెలుసుకున్న ప్రజలు ఆందోళనకు గురైనారు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో స్థానికులు మరింత భయపడి పోయారు.
గురువారం గురుదాస్ పూర్ బస్ స్టాండ్ దగ్గర నల్లటి బ్యాగ్ వదలి పెట్టి వెళ్లారు. స్థానికులకు అనుమానం రావడంతో పోలీసు అధికారులకు సమాచారం అందించారు. మొదట గురుదాస్ పూర్ జిల్లా డిప్యూటి కమిషనర్ అభినవ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

బస్ స్టాండ్ లో ఉన్న ప్రయాణికులు అందరిని ఖాళీ చేయించారు. తరువాత జిల్లా ఎస్పీ గుర్ ప్రీత్ సింగ్, బాంబు నిర్వీర్యదళం బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బ్యాగ్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. అందులోని కొన్ని వస్తులు బయటకు తీశారు.
తరువాత జిల్లా ఎస్పీ గుర్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ బస్ స్టాండ్ దగ్గర నల్లటి బ్యాగ్ స్వాదీనం చేసుకున్నామని అన్నారు. అయితే అందులో ఉన్నది బాంబులా, కాదా అనే విషయం మాత్రం ఆయన బయటకు చెప్పలేదు. బ్యాగ్ లో కొన్ని వస్తువులు స్వాదీనం చేసుకున్నామని అన్నారు. సోమవారం గురుదాస్ పూర్ జిల్లాలోని దీనానగర్ లో ముగ్గురు ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications