వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గోఎయిర్ విమానంకు బాంబు బెదిరింపు కాల్: శ్రీనగర్‌లోనే నిలిచిపోయిన ప్లేన్, తనిఖీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విమానం లోపల బాంబు ఉందని టెలిఫోన్ కాల్ హెచ్చరికతో.. ఢిల్లీకి వెళ్లాల్సిన గోఎయిర్ విమానాన్ని సోమవారం శ్రీనగర్‌లో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో విమానాన్ని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అయితే, విమానంలో ఏమీ దొరకలేదని కాశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ తెలిపారు.

విమానంలో బాంబు ఉందని మరో ప్రైవేట్ క్యారియర్ సూపర్‌వైజర్‌కు కాల్ రావడంతో గోఎయిర్ విమానం తిరిగి ఢిల్లీకి వెళ్లాలని భావించినా.. శ్రీనగర్ ఎయిర్ టెర్మినల్ వద్ద నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు.

 Bomb threat Call: GoAir Plane En Route To Delhi Stopped At Srinagar Airport

ఢిల్లీకి కాల్ ఫాలో అయ్యిందని, ఆ పాయింట్ నుంచి నెంబర్ ఆఫ్ చేయబడిందని వారు చెప్పారు. పోలీసులు ఈ విషయాన్ని పరిశీలిస్తున్నారని, ఎయిర్ టెర్మినల్ కార్యకలాపాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొనసాగుతున్నాయని విజయ్ కుమార్ తెలిపారు.

కాగా, ఇటీవల కొందరు ఆకయితాయిలు ఇలాంటి ఫోన్లు చేస్తున్నారు. అయితే, నిర్లక్ష్యం చేస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితులు ఉండటంతో పోలీసులు, భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

English summary
Bomb threat Call: GoAir Plane En Route To Delhi Stopped At Srinagar Airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X