బాంబు బెదిరింపు.. న్యూయార్క్-న్యూఢిల్లీ విమానం రోమ్‌కు మళ్లింపు
అమెరికాలోని న్యూయార్క్ నగరం నుంచి న్యూఢిల్లీకి వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో న్యూఢిల్లీకి రావాల్సిన ఆ అమెరికన్ ఎయిర్ లైన్స్ ఫ్లైట్ AA292 విమానంను ఇటలీలోని రోమ్ నగరానికి మళ్లించారు. టర్కీ వరకు వచ్చిన ఆ విమానాన్ని తిరిగి వెనక్కి పంపారు. దీనిపై అధికారులు విచారణ చేపట్టారు.
విమానంలో పేలుడు పరికరం ఉందని సిబ్బందికి నిఘా సమాచారం అందడంతో అంతర్జాతీయ విమానయాన భ్రదతా ప్రోటోకాల్ ప్రకారం చర్యలు తీసుకున్నారు. ఎయిర్ నవా్ రాడార్ ట్రాకింగ్ సర్వీస్ ప్రకారం.. విమానం అకస్మాత్తుగా మధ్యధరా సముద్రం మీదుగా తన మార్గాన్ని మార్చి అత్యవసర ల్యాండింగ్ కోసం రోమ్ వైపు మళ్లించారు.

280 మందికిపైగా ప్రయాణికులతో వెళుతున్న బోయింగ్ విమానం కాస్పియన్ సముద్రం మీదుగా ప్రయాణిస్తూ తన మార్గాన్ని మార్చుకుంది. కాగా, శనివారం రాత్రి 8.30 గంటలకు న్యూయార్క్ నుంచి యల్దేరిన జేఎఫ్‌కే విమానాశ్రయం నుంచి ఏఏ292 విమానంకు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో న్యూఢిల్లీకి రావాల్సిన రోమ్ వైపునకు దిశను మార్చుకుంది.
రోమ్ విమానాశ్రయంలో భద్రతా అనుమతి పొందిన తర్వాత విమానం మళ్లీ న్యూఢిల్లీకి బయల్దేరుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, విమానం ప్రయాణిస్తున్న దిశలో ఉన్న సమీప విమానాశ్రయంలో ల్యాండ్ చేయకుండా.. రోమ్ కు మళ్లించాలనే నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
ఇక, రోమ్‌లో విమానం ఎమర్జెన్సీని ల్యాండ్ అవడంతో విమానాశ్రయంలోని మర్జెన్సీ రెస్పాన్స్ టీం, స్థానిక పోలీసులతో సహా ఇటాలియన్ అధికారులు అప్రమత్తమయ్యారు. విమానం వద్దకు ప్రత్యేక దళాలు మోహరించి తనిఖీలు చేపట్టాయి. కాగా, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకునే విమానాన్ని రోమ్‌లో ల్యాండ్ చేసినట్లు అమెరికా విమానాయన సంస్థ తెలిపింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications