అలిపిరి కాలిబాట మార్గంలో ఇకపై..

తిరుమల శ్రీవారి దర్శనార్థం తిరుపతి నుంచి కాలినడకన వెళ్లే భక్తుల సౌకర్యార్థం అలిపిరి నడక మార్గంలో టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి గురువారం సమగ్ర తనిఖీలు నిర్వహించారు. తిరుపతిలోని మాధవ నిలయం పీఏసీ-2 నుంచి జీఎన్‌సీ టోల్‌గేట్ వరకు ఉన్న కాలిబాట రహదారి పొడవునా పర్యటించారు. భక్తులకు అందుబాటులో ఉన్న వసతులను స్వయంగా పరిశీలించారు.

నడక మార్గంలో తిరుమలకు చేరుకునే భక్తులకు ఉచిత వసతి సముదాయాలు, శ్రీవారి దర్శన సమయాలకు సంబంధించిన సమాచారం సులభంగా తెలిసేలా ప్రదర్శన బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులకు వెంకయ్య చౌదరి సూచించారు. కాలిబాట మార్గంలో ఈ బోర్డులు ఏర్పాటు చేయడం ద్వారా భక్తులకు పక్కా సమాచారం అందుతుందని పేర్కొన్నారు. భక్తులకు అవసరమైన ప్రాథమిక సమాచారం నిరంతరం అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

TTD AEO Ch Venkaiah Chowdary inspected the Alipiri footpath route from PAC 2 to the GNC Toll Gate

పర్యటనలో భాగంగా మార్గమధ్యలో పలు దుకాణాలను అదనపు ఈవో పరిశీలించారు. తాగునీరు, ఆహార పదార్థాల ధరల గురించి ఆరా తీశారు. టీటీడీ నిర్దేశించిన ధరలకే విక్రయించాలని ఆదేశించారు. నిర్ణీత ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

తిరుమల అన్నప్రసాద కేంద్రం, లగేజీ కౌంటర్ల వద్ద ఇకపై కొత్తగా.. !!
తిరుమల అన్నప్రసాద కేంద్రం, లగేజీ కౌంటర్ల వద్ద ఇకపై కొత్తగా.. !!

అలిపిరి పాదచారుల మార్గంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చేపట్టాల్సిన పలు కీలక అభివృద్ధి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో వెంకయ్య చౌదరి సమీక్షించారు. నడక మార్గంలో తాగునీటి సరఫరా, పారిశుధ్య నిర్వహణ, విద్యుత్ దీపాలు, విశ్రాంతి స్థలాల వద్ద మెరుగైన ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. పండుగలు, సెలవు దినాల్లో తిరుమలకు వచ్చే కాలినడక భక్తుల ప్రయాణ అనుభవాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చేలా చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.

ఎక్స్ స్పేస్ లో జగన్ పై అసభ్యకర వ్యాఖ్యలు: రాష్ట్రం బయట ఉన్నా వదిలిపెట్టని వైసీపీ
ఎక్స్ స్పేస్ లో జగన్ పై అసభ్యకర వ్యాఖ్యలు: రాష్ట్రం బయట ఉన్నా వదిలిపెట్టని వైసీపీ

కాలినడకన వచ్చే భక్తుల సేవలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి అధికారులకు వెంకయ్య చౌదరి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తిరుమల కొండకు కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య నిరంతరం పెరుగుతున్న నేపథ్యంలో, వారి ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరచడానికి టీటీడీ అధికార యంత్రాంగం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. అలిపిరితో పాటు శ్రీవారి మెట్టు మార్గంలోనూ మరిన్ని సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపడుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+