ఆడబిడ్డ పుట్టిందని చీదరించుకున్నారు.. కట్ చేస్తే.. 24 గంటల్లోనే తండ్రి కోటీశ్వరుడయ్యాడు..

భారత్ లో ఆడబిడ్డ పుట్టడాన్ని చాలామంది లక్ష్మీదేవిగా భావిస్తుంటారు. ఇంట్లో ఒక్కరైనా ఆడపిల్ల ఉండాలని కోరుకుంటారు. కానీ కొంతమంది మాత్రం ఇప్పటికీ ఆడపిల్లను భారంగానే చూస్తున్నారు. తమకు మగబిడ్డే కావాలని పట్టుబట్టే కుటుంబ సభ్యులూ ఉన్నారు. అటు ఇంకొంతమంది అక్రమంగా లింగ నిర్థారణ పరీక్షలు చేయించి ఆడపిల్ల అయితే అబార్షన్ చేయించుకోవాలని ఇబ్బంది పెడుతున్నవాళ్లూ ఉన్నారు. అయితే తాజాగా ఓ సాధారణ కార్పెంటర్ ఇంట్లో ఆడబిడ్డ జన్మించింది. కానీ ఆ కుటుంబం మగబిడ్డ కావాలని కోరుకుంది. అయితే ఆడబిడ్డ పుట్టిన 24 గంటల్లోనే పసిబిడ్డ తండ్రి కోటీశ్వరుడు అయ్యాడు. దాంతో ఆ కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంది. తమ ఇంట్లో లక్ష్మీదేవి పుట్టిందని సంబరాలు చేసుకుంటున్నారు. ఈ ఆసక్తికరమైన ఘటన పంజాబ్ లో జరిగింది.

ఏం జరిగింది..?

పంజాబ్ లోని మన్సా జిల్లా బరేటా టౌన్ కు చెందిన 24 ఏళ్ల యుధ్ వీర్ సింగ్ కార్పెంటర్ గా పనులు చేస్తున్నాడు. అయితే అతను నవంబర్ 6 తండ్రి అయ్యాడు. తన భార్య పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను చూసేందుకు వచ్చిన బంధువులు ఆడపిల్ల అని చీదరించుకున్నారు. కానీ 24 గంటల్లోనే చిన్నారి తండ్రి యుధ్ వీర్ సింగ్ కోటీశ్వరుడు అయ్యాడు. భార్యను కాన్పుకు తీసుకొస్తూ ఆయన పంజాబ్ స్టేట్ డియర్ 200 మంత్లీ లాటరీని రూ. 200 పెట్టి కొనుగోలు చేశాడు. బిడ్డ పుట్టిన రోజే ఆయనకు ఏకంగా కోటీ 50 లక్షల బంపర్ లాటరీ తగిలింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ కుటుంబాన్ని చిన్నారి జననం క్షణాల్లో కోటీశ్వరులను చేసిందని పలువురు మాట్లాడుకుంటున్నారు.

Punjab Father wins Rs 1 5 crore lottery within 24 hours of daughter s birth an interesting incident

ఈ ఘటనపై యుధ్ వీర్ సింగ్ మాట్లాడుతూ.. తన భార్యను కాన్పుకు తీసుకొస్తూ నవంబర్ 4 న లాటరీ కొనుగోలు చేసినట్లు తెలిపాడు. తాను ఆస్పత్రికి వెళ్తూ మొబైల్ సిమ్ కార్డ్ ను పోర్ట్ చేయించుకునేందుకు ఆగినట్లు తెలిపాడు. అయితే అక్కడే లాటరీ షాపు ఉన్న నేపథ్యంలో తన అదృష్టాన్ని పరీక్షించుకుందామని లైఫ్ లో ఫస్ట్ టైమ్ లాటరీని కొనుగోలు చేసినట్లు పేర్కొన్నాడు. అయితే తొలుత తాను లాటరీ కొనుగోలు చేయడం తన భార్యకు ఇష్టం లేదని.. ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం.. మెడికల్ టెస్టులకు కూడా డబ్బులు లేవు.. అలాంటివి ఎందుకు అని వారించిందని తెలిపాడు. ఇక నవంబర్ 7 న తన బిడ్డ పుట్టిన రోజే లాటరీ ఫలితాలు వెల్లడయ్యాయని.. తనకు లాటరీ తగలడం చూసి ఆశ్చర్యపోయానని ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న తన కుటుంబంలోకి ఒక్కసారిగా కోటీ 50 లక్షలు వచ్చి పడ్డాయని స్పష్టం చేశాడు. ఈ డబ్బును తన ఇంటి నిర్మాణానికి.. తన చిన్నారి విద్యకోసం ఖర్చు చేస్తామని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అటు సామాజిక మాధ్యమాల్లోనూ ఈ ఘటన వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+