జియాఖాన్ మృతి కేసు: సిబిఐకి బదలీ చేసిన హైకోర్టు

జియాఖాన్ మృతి కేసు విచారణను సిబిఐకి బదిలీ చేయాలని ఆమె తల్లి రబియా ఖాన్ చేసిన అభ్యర్థన మేరకు కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా పౌరురాలైన జియాఖాన్ 2013, జూన్ 3న ముంబైలోని జుహూలోని తన నివాసంలో అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మరణించారు.
జియాఖాన్ నివాసంలో పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో బాలీవుడ్ నటుడు ఆదిత్య పంచోలి కుమారుడు, జియాఖాన్ ప్రియుడు సూరజ్ పంచోలిని పోలీసులు అరెస్ట్ చేశారు.
సూసైడ్ నోట్ జియా రాసింది కాదని ఆమె తల్లి రబియా ఆరోపించారు. జియాఖాన్‌ది హత్యేనని రబియా ఖాన్ హైకోర్టులో పిటిషన్ వేశారు. సిబిఐచే విచారణ కొనసాగించాలని అభ్యర్థించారు. ఈ నేపథ్యంలో హైకోర్టు సిబిఐకి ఈ కేసును బదిలీ చేసింది.












Click it and Unblock the Notifications