Ganesh Chaturthi: డీజే పెడితే ఇక అంతే.. వార్నింగ్ వచ్చేసింది..
దేశ వ్యాప్తంగా నగరాలు, పట్టణాలు, పల్లెలు వినాయక చవితికి ముస్తాబవుతున్నాయి. గణేష్ చతుర్థిని విజయవంతంగా నిర్వహించేందుకు చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ సిద్ధం అవుతున్నారు. గల్లీల్లో గణేష్ మండపాలను సిద్ధం చేస్తున్నారు. ఈనెల 27న వినాయక చవితి కాగా సెప్టెంబర్ 6 వరకు గణేష్ నవరాత్రులు జరగనున్నాయి. అయితే గణేష్ పండుగ దేశం మొత్తం ఒక ఎత్తు అయితే ముంబైలో మరో ఎత్తు. ముంబైలో జరిగినంతగా దేశంలోని మరే నగరంలో జరగదు. ముంబై లోని ప్రతి గల్లీలో పదుల సంఖ్యలో గణేష్ మండపాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో బాంబే హైకోర్టు, ముంబై పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు.
అన్ని ప్రాంతాల్లో మాదిరిగానే ముంబైలోనూ గణేష్ పండుగ వాతావరణం మొదలైంది. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 10న లాల్ బాగ్, పరేల్, దాదర్ వంటి కీలక ప్రాంతాల నుండి వినాయకుడి విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. అయితే భారీ డప్పు శబ్దాలతో ఈ ఊరేగింపు జరిగింది. దీనిపై ముంబై పోలీసులు కఠిన రూల్స్ పెట్టారు. వినాయక చవితి సందర్భంగా డీజేలను నిషేధించడమే కాకుండా నిబంధనలను ఉల్లంఘిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అటు ముంబై హైకోర్టు సైతం కీలక సూచనలు చేసింది. ఈ మేరకు వినాయక మండపాల వద్ద డీజేను బ్యాన్ చేసింది. నగరంలో శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు డీజేల వాడకంపై నిషేధం విధిస్తున్నట్లు బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాక రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు శబ్ద స్థాయిని 50 డెసిబల్స్ కు దాటొద్దని ఆదేశించింది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది బాంబే హైకోర్టు.












Click it and Unblock the Notifications