Border row: బార్డర్ పంచాయితీ, అమిత్ షా ఎంట్రీ, డేట్ ఫిక్స్, సీఎంలు ఏం చెబుతారో ?, ఒకే పార్టీతో !

న్యూఢిల్లీ/బెంగళూరు/ముంబాయి: కర్ణాటక-మహారాష్ట్రాల సరిహద్దు వివాదంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది. కేంద్ర హోమ్ శాఖా మంత్రి అమిత్ షాతో కర్ణాటక, మహారాష్ట్రల ముఖ్యమంత్రుల సమావేశానికి డేట్, టైమ్ ఫిక్స్ అయ్యింది. కర్ణాటక-మహారాష్ట్రాల సరిహద్దులోని బెళగావి జిల్లా వివాదంలో రెండు రాష్ట్రాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్ మాట్లాడి బెళగావి విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మనవి చేశారు. ఇప్పుడు శివసేన, ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడి కూటమి కేంద్ర మంత్రి అమిత్ షాను భేటీ కావడంతో కథ మలుపు తిరిగింది. మహారాష్ట్ర, కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వాలు ఉండటంతో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో వేచి చూడాలి.

రెండు రాష్ట్రాల్లో రచ్చరచ్చ

రెండు రాష్ట్రాల్లో రచ్చరచ్చ

కర్ణాటకలోని బెళగావి జిల్లా మాదే అంటూ దశాభ్దాల నుంచి మహారాష్ట్ర నాయకులు వాదిస్తున్నారు. ఇప్పటికే బెళగావి సరిహద్దు వివాదం సుప్రీం కోర్టు వరకు వెళ్లింది. ఇటీవల బెళగావి సరిహద్దు విషయంలో మహారాష్ట్ర మంత్రులు, నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చెయ్యడంతో కర్ణాటక, మహారాష్ట్రలో రచ్చరచ్చ అయ్యింది.

బస్సు సర్వీసులు రద్దు

బస్సు సర్వీసులు రద్దు

బెళగావిలో కన్నడ జెండాలు తగలబెట్టడంతో వివాదం ముదిరిపోయింది. బెళగావి జిల్లా సరిహద్దులో ఆందోళనకు దిగిన వందలాది మంది కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు అరెస్టు అయ్యారు. మహారాష్ట్ర-కర్ణాటకల మద్య సంచరిస్తున్న అంతరాష్ట్ర బస్సు సర్వీలు పూర్తిగా రద్దు కావడంతో ప్రయాణికులు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

ఒక్క అడుగు ముందుకు వేసిన కర్ణాటక సీఎం

ఒక్క అడుగు ముందుకు వేసిన కర్ణాటక సీఎం

బెళగావి సరిహద్దు వివాదంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్ ఒక్క అడుగు ముందుకు వేసి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండేతో మాట్లాడారు. కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ, నడ్డాతో మాట్లాడిన కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ బెళగావి విషయంలో జోక్యం చేసుకోవాలని మనవి చేశారు.

అమిత్ షాను కలిసిన ప్రతిపక్షాలు

అమిత్ షాను కలిసిన ప్రతిపక్షాలు

కర్ణాటక సీఎం బసవరాజ్ బోమ్మయ్ కేంద్ర మంత్రి అమిత్ షాతో ఫోన్ మాట్లాడి బెళగావి విషయంలో మీరు జోక్యం చేసుకోవాలని మనవి చేసిన తరువాత మహారాష్ట్రలోని శివసేన, ఎన్ సీపీ, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలోని మహావికాస్ అఘాడి కూటమి కేంద్ర మంత్రి అమిత్ షాను భేటీ అయ్యారు. బెళగావి విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని మహావికాస్ అఘాడి కూటమి అమిత్ షాకు మనవి చేసింది.

డేట్ ఫిక్స్

డేట్ ఫిక్స్

అమిత్ షాతో భేటీ అయిన తరువాత ఎన్ సీపీ నాయకుడు అముల్ కోల్డే న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బోమ్మయ్, మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండేతో ఈనెల 14వ తేదీన అమిత్ షా భేటీ కానున్నారని, ఆరోజు ఇద్దరు సీఎంలు ఏం చెబుతారో చూడాలని ఎన్ సీపీ నాయకుడు అముల్ కోల్డే అన్నారు.

ఎవరి ఆశలు వారివే

ఎవరి ఆశలు వారివే

బెళగావిలోని లక్షలాది మంది మరాఠీల మనోభావాలను గుర్తించి బెళగావి విషయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని మరాఠీలు ఆశగా ఎదురు చూస్తున్నారని ఆయన చెప్పారు. మొత్తం మీద అమిత్ షా ఎంట్రీతో బెళగావి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్ని కన్నడిగులు, మరాఠీలు ఎదురు చూస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+