బోస్ భారత తొలి ప్రధాని-కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్-ఆడుకుంటున్న నెటిజన్స్..!
నిత్యం తన వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇప్పుడు బీజేపీ తరఫున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా తన పాత వైఖరి మాత్రం మార్చుకోవడం లేదు. తాజాగా భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోసే అంటూ కంగనా చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. భారత తొలి ప్రధాని ఎవరో కూడా తెలియకుండానే లోక్ సభ ఎంపీ అయ్యేందుకు కంగనా పోటీ చేస్తున్నారా అన్న చర్చ సాగుతోంది. కంగనా వ్యాఖ్యలపై నెటిజన్లు గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు.
జాతీయ వార్తా ఛానల్ టైమ్స్ నౌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న బీజేపీ ఎంపీ అభ్యర్ధి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోసే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. దీంతో ఆమె వ్యాఖ్యల వీడియో నెట్లో వైరల్ గా మారింది. ఆమె వీడియోను పలువురు సెలబ్రిటీలు ఎక్స్ లో షేర్ చేసి ఆమె అజ్ఞానంపై మండిపడుతున్నారు. సాధారణ నెటిజన్లు కూడా కంగనాను బీజేపీ ఎంపీ అభ్యర్ధిగా ఎలా ఎంపిక చేసిందని ప్రశ్నిస్తున్నారు.

Subhash Chandra Bose was the first Prime Minister of India : BJP candidate Kangana Ranaut.
— Roshan Rai (@RoshanKrRaii) April 4, 2024
IQ 🫡pic.twitter.com/v6VAekwz3F
దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి పరిస్ధితుల్ని ప్రస్తావిస్తూ తొలి ప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంటూ కంగన చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ నేతలతో పాటు చరిత్రకారులు కూడా తప్పుబడుతున్నారు. ముందు చరిత్ర తెలుసుకోవాలని వారు కంగనాకు సూచిస్తున్నారు. అయితే కంగనా మాత్రం ఈ వ్యాఖ్యలపై ఎలాంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు.
Clowns of Supreme Joker’s Party… what a Disgrace..#justasking .. ಮಹಾಪ್ರಭುವಿನ ಆಸ್ಥಾನ ವಿದೂಷಕರು… https://t.co/Q17wagFd0M
— Prakash Raj (@prakashraaj) April 4, 2024












Click it and Unblock the Notifications