• search
  • Live TV
నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఇద్దరూ పెళ్లైనవాళ్లే.. ‘ఫేస్‌బుక్‌లో ప్రేమించుకున్నారు’.. నిజామాబాద్ నుంచి యూపీ వెళ్లిన మహిళ, హత్య చేసిన ‘లవర్’

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
హత్యకు గురైన ఉస్మా కౌసర్

తెలంగాణకు చెందిన ఒక మహిళ 'ఫేస్‌బుక్‌ ప్రియుడిని’ కలుసుకునేందుకు ఉత్తరప్రదేశ్ వెళ్లారు. వెళ్లిన మరుసటి రోజే శవంగా కనిపించారు.

ఆమె పేరు ఉస్మా కౌసర్. వయసు 32ఏళ్లు. ఊరు నిజామాబాద్‌లోని పులాంగ్ కాలనీ. పన్నెండేళ్ల కిందట కామారెడ్డి జిల్లా బాన్స్‌వాడ ఫిర్‌దోస్ కాలనీకి చెందిన ముఖీద్‌తో ఆమెకు పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కొడుకులు.

ఉస్మా కౌసర్ భర్త ముఖీద్ మాంసం కొట్టు నడుపుతున్నారు. భార్యాభర్తల మధ్య కొంత కాలంగా విభేదాలున్నాయి. సుమారు 4 నెలలుగా ఆమె పుట్టింట్లో ఉంటోంది. ఈ నెల 4న పెద్దమనుషులు మాట్లాడి కౌసర్‌ను భర్త వద్దకు తీసుకువచ్చారు.

మరుసటి రోజు తెల్లవారు జాము నుంచి ఆమె కనిపించకుండా పోవడంతో భర్తతోపాటు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు బాన్స్‌వాడ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదయ్యింది.

ఉస్మా కౌసర్ కనిపించకుండా పోయిన నాలుగు రోజుల తరువాత అంటే ఈ నెల 9న ఆమె శవం ఉత్తరప్రదేశ్‌లోని గజ్‌రౌలాలో కనిపించింది.

బాన్సువాడ పోలీసు స్టేషన్

ఏం జరిగింది?

ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో ఉస్మా కౌసర్‌కు ఫేస్‌బుక్ ద్వారా స్నేహం ఉన్నట్లుగా తమ విచారణలో తేలిందని బాన్స్‌వాడ్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ మహేందర్ రెడ్డి బీబీసీకి తెలిపారు.

'కనిపించడం లేదని ఫిర్యాదు అందిన వెంటనే విచారణ ప్రారంభించాం. నవంబర్ 6న ఉస్మా కౌసర్ బాన్స్‌వాడ బస్ స్టేషన్‌లో బస్సు ఎక్కినట్టుగా గుర్తించాం. హైదరాబాద్ వరకు ఆమె జాడను ట్రేస్ చేశాం. ఆ తర్వాత ఎక్కడికి వెళ్లిందో తెలియలేదు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో ఫేస్‌బుక్ స్నేహం ఉన్నట్టుగా మా విచారణంలో తేలింది’ అని మహేందర్ రెడ్డి చెప్పారు.

https://twitter.com/ANINewsUP/status/1591563947312046081

'పెళ్లి కోసం ఉత్తరప్రదేశ్‌కు’

ఈ కేసును విచారించిన ఉత్తరప్రదేశ్ పోలీసు అధికారి అరుణ్ కుమార్ సింగ్, స్థానిక పత్రికలకు వెల్లడించిన వివరాల ప్రకారం...

హైదరాబాద్ చేరుకున్న ఉస్మా కౌసర్ అక్కడి నుంచి విమానంలో దిల్లీకి వెళ్లారు. దిల్లీ నుంచి ప్రైవేట్ వాహనంలో ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లా గజ్‌రౌలాకు ఈ నెల 8న చేరుకున్నారు. హోటల్‌లో ఆమె దిగగా అక్కడే ఫేస్‌బుక్ ఫ్రెండ్ షహజాద్ కలిశారు.

'ఇదివరకే పెళ్లి’

గజ్‌రౌలాలోని చిల్లా మోహల్లాకు చెందిన షహజాద్‌కు ఇదివరకే పెళ్లి అయింది. భార్యతో మనస్పర్థలున్నాయి. ఆయన స్థానికంగా పెయింట్ షాపు నిర్వహిస్తున్నారు.

'6నెలల కిందట ఉస్మా కౌసర్, షహజాద్‌లకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతోనే ఆమె ఉత్తరప్రదేశ్‌కు వచ్చారు. హోటల్‌లో ఇద్దరు కలుసుకున్నాక తనను వెంటనే పెళ్లి చేసుకోవాల్సిందిగా షహజాద్‌ను కౌసర్ కోరారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది’ అని పోలీసులు తెలిపారు.

ఓటరు ఐడీ కార్డుతో గుర్తింపు

ఈ నెల 9న గజ్‌రౌలా చేపల మార్కెట్ సమీపంలో ఓ సెక్యూరిటీ ఏజెన్సీ వద్ద గుర్తు తెలియని మహిళ శవాన్ని గుర్తించిన స్థానికులు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. శవం దొరికిన ప్రాంతానికి సమీపంలోనే షహజాద్ నడిపే పెయింట్ షాప్ ఉంది.

ఘటనా స్థలంలో లభ్యమైన ఓటర్ ఐడీ కార్డ్ ఆధారంగా చనిపోయిన మహిళ ఉస్మా కౌసర్‌గా ఉత్తరప్రదేశ్ పోలీసులు గుర్తించారు. ఆ విషయాన్ని నిజామాబాద్ పోలీసులకు తెలిపారు.

'యూపీ గజ్‌రౌలా పోలీసుల నుంచి సమాచారం అందిన వెంటనే ఓటర్ ఐడీ కార్డ్ ఆధారంగా విచారణ జరిపి అడ్రస్ ట్రేస్ చేశాం. మృతురాలు బాన్స్‌వాడకు చెందిన మహిళగా తేలింది. కొద్ది రోజుల కిందటే ఆమె కనిపించకుండా పోయినట్లుగా కేసు నమోదైనట్టుగా గుర్తించాం.

బాన్స్ వాడ పోలీసుల ద్వారా మృతురాలి బంధువులకు సమాచారం అందించాం’ అని నిజామాబాద్ వన్ టౌన్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కుమార్ బీబీసీకి వెల్లడించారు.

https://twitter.com/amrohapolice/status/1591091433137901570?t=BwF7SW2xngb9TFw8DOn6Hg&s=08

'ఇటుకతో బాది...’

ఆ ప్రాంతంలోని సిసి కెమెరాల ఫుటేజీని పరిశీలించగా షహజాద్ మీద పోలీసులకు అనుమానం వచ్చింది. దాంతో అదుపులోకి తీసుకొని విచారించగా అతనే హత్య చేసినట్లు తేలిందని ఉత్తరప్రదేశ్ పోలీసులు తెలిపారు.

'గజ్‌రౌలా పోలీస్ స్టేషన్ పరిధిలో లభించిన మృత దేహం, తెలంగాణకు చెందిన మహిళదిగా మా విచారణలో తేలింది. ఆమె మీద మిస్సింగ్ కేసు నమోదైనట్టుగా కూడా తెలిసింది.

ఆమె పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తేవడంతో ఇటుకతో తలపై కొట్టి, షహజాద్ హత్య చేశాడు. నిందితుడిని అరెస్ట్ చేశాం’ అని మోహ్రౌలా జిల్లా ఎస్పీ ఆదిత్య లంగేష్ ట్వీట్ చేశారు.

'సఖ్యతగానే ఉండేవారు’

'భార్యాభర్తలు సఖ్యతగానే ఉండేవారు. ఈ మధ్య విభేదాలు వస్తే పెద్దమనుషులతో మాట్లాడి సర్ది చెప్పి అత్తారింటికి ఉస్మా కౌసర్‌ను తీసుకొచ్చాం. ఇంతలోనే ఇలా జరిగింది. యూపీ పోలీసుల నుంచి కాల్ వచ్చిందని తెలిసి కుటుంబ సభ్యులు అందరూ అక్కడికి వెళ్లారు’ అని స్థానికుడు అహ్మద్ బీబీసీతో చెప్పారు.

ఇవి కూడా చదవండి:

English summary
Both are married.. 'Loved each other on Facebook'.. Woman who went to UP from Nizamabad, murdered 'lover'
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X